AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

హైకోర్టు తీర్పు అనుసరించి ఏజెన్సీ ప్రాంత గిరిజన…

1 min read

AABNEWS : హైకోర్టు తీర్పు అనుసరించి ఏజెన్సీ ప్రాంత గిరిజన ఉపాధ్యాయులకు 100% పదోన్నతుల ఇవ్వకపోతే పదోన్నతులు ఏజెన్సీ ప్రాంతంలో జరగనివ్వం జాదో రవీందర్ TTF.అదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి AAB News ఆదిలాబాద్ :ఉట్నూర్ మండలం లోని శంకర్ తండా గ్రామంలో జాదో రవీందర్ మాట్లాడుతూ ఏజెన్సీప్రాంతంలో పదోన్నతులు హైకోర్టు తీర్పుకు అనుగుణంగా 100% గిరిజన ఉపాధ్యాయులకు ఇవ్వకపోతే ఏజెన్సీ ప్రాంతంలో పదోన్నతులు అడ్డుకుంటామని హెచ్చరించారు.అదే విధంగా ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని తెలిపారు. జీఓ నెంబర్ 3 కు చట్టబద్ధత కల్పించాలి. 11వ PRCలో 63 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి.ఏజెన్సీ ఉద్యోగ – ఉపాధ్యాయులకు ఏజెన్సీ అలవెన్స్ లు SCA 5000/- ,AHRA 25% బేసిక్ పే మీద ఇవ్వాలి CPS ను రద్దు చేసి OPS ను అమలు చేయాలి. ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్న గిరిజనేతర ఉపాధ్యాయులను మైదాన ప్రాంతానికి పంపించాలి.
ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రత్యేక సర్వీస్ రూల్స్ అమలు చేయాలి.పదోన్నతుల చానల్ పెంచాలి ఆశ్రమ CRTలకు రెగ్యులర్ చేయాలి.
గురుకుల పార్ట్ టైమ్, KGBV, ఆశ్రమ CRT లకు 10వ వేతన సంఘం సిఫార్సుల మేరకు స్కూల్ అసిస్టెంట్ వేతనం మంజూరు చేయాలి.ప్రతి పాఠశాలకు స్కావేంజర్ పోస్ట్ లు మంజూరు చేయాలి.TRT-2017 సెలక్టైన ఏజెన్సీ గిరిజన అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలి.ఏజెన్సీ జిల్లాలలోని DEO ఆఫీసులలో గల ప్రత్యేక పోస్ట్ లలో(ACE/సెక్టోరియల్/జిల్లా సైన్స్ అధికారులు) అర్హులైన గిరిజన ఉపాధ్యాయులను నియమించాలి.పండిట్ మరియు PET పోస్ట్ లను అప్గ్రేడ్ చేయాలి.
ప్రతి ప్రాథమిక పాఠశాలలో LFL HM పోస్ట్ లు సృష్టించి SGT లకు LFLHM లుగా ప్రమోషన్లు ఇవ్వాలి.నగదు రహిత ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను అమలు చేయాలి.రిటైర్మెంట్ మరియు డెత్ గ్రాట్యుటి ను 25 లక్షలకు పెంచాలి. ఏజన్సీ ప్రాంతంలోని గిరిజన వసతి గృహాలలో పనిచేస్తున్న గిరిజన WARDEN లకు 100% పదోన్నతులు కల్పించి సీనియర్ వార్డెన్ లుగా అర్హులైన గిరిజన వార్డెన్ లకు ఇవ్వాలి.ఈ కార్యక్రమంలోTTF.సభ్యులు పవన్ లాల్. కైలాస్ విజయ్. ముకుంద మహేందర్ అనిల్ పాల్గొన్నవారు.

 480 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.