AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

TCA ఆధ్వర్యంలో సజావుగా క్రికెట్ క్రీడాకారుల ఎంపిక …

1 min read

AABNEWS : గ్రామీణ ప్రాంతాలలోని పిల్లలలో దాగిఉన్న క్రీడా ప్రతిభను విలికి తీయలనే ఉద్దేశంతో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన అండర్ 16, అండర్ 19 క్రికెట్ ఎంపిక కు విశేషంగా స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో TCA ఉపాధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి, పార్థసారథి పాల్గొని క్రీడలను ప్రారంభించారు. TCA జిల్లా ఇంచార్జి నారోత్తం, కోచ్ విజయ్ కుమార్ సారథ్యంలో ఏర్పాట్లను పూర్తి చేసి పోటీలను సజావుగా నిర్వయించారు. ఈ సెలెక్షన్ లను ప్రత్యేక నిపుణులుగా విచ్చేసిన BCCI లెవల్ 1 అంపైర్ కిషోర్, పవన్ ల సమక్షంలో క్రీడాకారుల సెలెక్షన్ కొనసాగింది. అనంతరం బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో క్రికెట్ క్రీడకు క్రేజీ పెరుగుతుందన్నారు. అలాగే భవిష్యత్ తరలలో పిల్లలు దేశ సేవ చేయాలంటే క్రికెట్ పై కూడా మంచి పట్టు సాధించాని సూచించారు. అండర్16, అండర్ 19 క్రికెట్ కు సెలెక్ట్ కానీ క్రీడా కారులు బాధ పడవాల్సిన అవసరంలేదన్నారు. మళ్ళీ సెలెక్షన్ కు 3 సంవత్సరాల వ్యవధిలో మీరు క్రికెట్ క్రీడలో ఇంకా పూర్తి మెలకువలు నేర్చుకొని పూర్తి స్థాయి క్రికెటర్ గా మారవచ్చని పిల్లలకు భరోసా కల్పించారు.

 57 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.