AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆన్లైన్ ఇన్ స్టంట్ లోన్ యాప్స్ మాయలో పడోద్దు

1 min read

AABNEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

ఆన్లైన్ ఇన్స్టంట్ లోన్ యాప్స్ తో ప్రజలు అప్రమత్తంగా వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. ఆన్లైన్ ఇన్స్టంట్ రుణ యాప్ లపై ప్రజలను అవగాహన కల్పించడం కోసం నూతనంగా రూపొందించిన సంక్షిప్త ప్రచార వీడియో మెసేజ్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ సెంట్రల్ జోన్ మరియు ఈస్ట్ జోన్ల ఇంచార్జ్ డి.సి.పిలు పుష్పా, వెంకటలక్ష్మీ సైబర్ క్రైం ఇన్ స్పెక్టర్ జనార్దన్ రెడ్డిలతో కల్సి శనివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఆన్లైన్ ఇస్టంట్ రుణ యాప్స్ పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఓ ప్రకటన చేశారు. సులువుగా రుణాలు ఇస్తున్నారన్న కారణంతో వ్యక్తులు, వ్యాపారస్థులు ఈ రుణ యాప్ లకు అకర్షితులవుతున్నారు. తీరా రుణాలు తీసుకున్నాకా అధిక వడ్డీ మరియు కనిపించని చార్జీల పేరిట యాప్ నిర్వహకులు రుణ గ్రహీతల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూళ్ళకు పాల్పడుతున్నారు. ప్రజలు రుణాలు తిరిగి చెల్లించే విషయంలో యాప్ నిర్వహకులు దారుణంగా వ్యవహరిస్తున్నారని, అంతేకాకుండా ముందుస్తూగా కుదిరిన ఒప్పందాన్ని దుర్వినియోగం చేస్తూ రుణ గ్రహీతల ఫోన్ల నుండి వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించడం జరుగుతోంది. ఇది చట్టరిత్యా నేరం. ఇలాంటి చట్టబద్ధత లేని యాప్స్ నుండి రుణాలు తీసుకుంటే ప్రజల ఇబ్బందులకు గురౌవుతారని, ప్రజలు కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి గుర్తింపు పొందిన బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వద్ద మాత్రమే రుణాలు తీసుకోవాలని. ముఖ్యంగా ప్రజలు చెప్పుడు మాటలు విని తమ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్, అధార్ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి తెలియజేయవద్దని పోలీస్ కమిషనర్ తెలిపారు. రుణం అవసరం వుందని ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకోని ఎదుటి వ్యక్తులు నమ్మించి రుణాలు పొందాక ఇబ్బందులకు గురిచేస్తారని ప్రజలు గుర్తించాలని. ఇలాంటి వ్యక్తులు, సంస్థల నుండి ప్రజలు అప్రమత్తంగా వుందాలని. ఎవరైన ఈ రుణాల విషయంలో వేధింపులకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి లేదా డయల్ 100కు లేక వరంగల్ పోలీస్ కమిషనరేట్ వాట్సప్ నంబర్ 9491089257కు సమాచారం అందించడం ద్వారా తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజాలకు సూచించారు.

 627 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.