November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ – దరఖాస్తుల స్వీకరణ

1 min read


AABNEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆర్మీ శిక్షణ కోసం ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి శ్రీ మంచాల
శ్రీనివాసు-DGM (పర్సనల్)గారు తెలియ జేశారు. ఈ ర్యాలీ మార్చి 5 వ తేదీ నుండి 24వ తేదీ వరకు హైదరాబాద్ లో నిర్వహిస్తారని తెలిపారు. ర్యాలీ లో పాల్గొనే వారికి సింగరేణి యాజమాన్యం, సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో 45 రోజుల పాటు ఉచిత
శిక్షణ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. కావున కార్మికుల పిల్లలు, మాజీ కార్మికుల పిల్లలు, భూ నిర్వాసితులు, పరిసర గ్రామాల యువత మరియు నిరుద్యోగ యువత ఈ
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఆసక్తి గల వారు ఈ నెల 15 నుండి 18 వ తేదీ లోగా స్థానిక జి.యం కార్యాలయం లోని పర్సనల్ డిపార్ట్మెంట్లో తమ దరఖాస్తులు అందజేయాలన్నారు. అలాగే ఈ నెల 19 వ తేదీన స్థానిక BR.అంబేధ్కర్ స్టేడియం గ్రౌండ్ లో ప్రాథమిక ఎంపిక కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు.

 730 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.