ఇ.పి ఆపరేటర్ (ట్రైనీ) డ్రైవింగ్ ప్రోఫిషియెన్సీ టెస్ట్ ప్రారంభం
1 min read
తేదీ 05.04.2021 (సోమవారం) రోజున ఇ.పి ఆపరేటర్ (ట్రైనీ) డ్రైవింగ్ ప్రోఫిషియెన్సీ ఎంపిక టెస్టులు Dr. BR అంబేడ్కర్ స్టేడియం నందు ప్రారంభమైనాయి. ఏరియా జి.యం శ్రీ “E.Ch. నిరీక్షన్ రాజ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఎంపికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఏరియా జి.యం గారు మాట్లాడుతూ కంపనీలో ఖాళీగా ఉన్న 210 పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఈ ఎంపికలు జరుగుతున్నాయని, కావున అభ్యర్థులందరూ అవకాశాన్ని సద్వినియోగం
చేసుకోవాలని సూచించారు. ఏ ఎంపికలు కేవలం ప్రతిభ ఆధారంగా జరుగుతాయని, ఎలాంటి
అపోహలు,నమ్మరాదని తెలిపారు. తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ అభ్యర్థులందరూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని కోరారు. అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు
తెలియజేశారు. ఎంపిక పరీక్షల కోసం చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తపరిచారు.భూపాలపల్లి ఏరియా లో 179 అభ్యర్ధులు పోటీలో ఉన్నందున ఎంపిక రెండు రోజులపాటు ఉంటుందని తెలిపారు. (05-04-2021 నుండి 06-04-2021 వరకు)
ఈ కార్యక్రమంలో శ్రీ R. విజయ ప్రసాద్, SO to GM గారు, N.రామలింగం-AGM (E&M) గారు, శ్రీ S. సారయ్య, EE (Auto Workshop), శ్రీ A. వసంత్, SE (IED), శ్రీ బాలరాజు,SE (సివిల్) శ్రీ మహమ్మద్ షరీఫ్, సెక్యూరిటీ ఆఫీసర్ . శ్రీ S.అనిల్ కుమార్,PM గారు,
కార్పొరేట్ నుండి ఈ పరీక్షల అబ్జర్వర్ వచ్చిన శ్రీ బండి రాజగోపాల్-PM గారు పాల్గొనడం
జరిగింది. అలాగే యూనియన్ నాయకులు శ్రీ కొక్కుల తిరుపతి (TBGKS)గారు, శ్రీ
ఎం.రమేష్ (AITUC) గారు పాల్గొన్నారు.
868 Total Views, 2 Views Today