AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి

1 min read

AAB NEWS:వరంగల్ పట్టణ ప్రతినిధి గైని ప్రవీణ్ కుమార్

ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్రవ్యాప్త ఓసీల మహాగర్జన – పోలాడి రామారావు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలులో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయకుండా సానుకూలంగా స్పందించి వెంటనే ప్రకటన చేయాలని ఓసీ సంఘాల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు . తెలంగాణ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తెలంగాణలో అమలుపర్చకపోవడాన్ని నిరసిస్తూ గురువారం హన్మకొండలో ఓసీ సంఘాల రాష్ట్ర , జిల్లా నాయకులతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జయపాల్ రెడ్డి అధ్యక్షతన ఉద్యమ కార్యాచరణపై చర్చించారు . ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఓసీ సంఘాల అనేక ఏళ్ల పోరాటాల ఫలితంగా కేంద్రం అగ్రకుల పేదలకు విద్యా , ఉద్యోగాల్లో రాజ్యాంగ సవరణ ద్వారా 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి రెండేళ్లు దాటిందన్నారు . కేంద్ర ప్రభుత్వ వివిధ సర్వీసులతో పాటు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయని , మన రాష్ట్రంలో మాత్రం అమలు చేయడం లేదని మండిపడ్డారు . ఇట్టి రిజర్వేషన్లపై ఇతర రాష్ట్రాల్లో లేని అభ్యంతరం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకని సూటిగా ప్రశ్నించారు . అగ్రకుల పేదలంటే ప్రభుత్వానికి చిన్నచూపని , కావాలనే కాలయాపన చేస్తున్నారన్నారు . రెండు సంవత్సరాలుగా ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలుకాకపోవడంతో 70 వేలకు పైగా ఓసీ యువతకు ఉన్నత విద్యావకాశాలు రాక తీవ్రంగా నష్టం జరిగిందని , పలువురు ఓసీ నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . స్వార్థ ప్రయోజనాలు , ఓటు బ్యాంకు రాజకీయాలతో పాలకులు ఓసీలకు అన్యాయం చేయడం దారుణమని మండిపడ్డారు . తాము కుల , మతాలకు , రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని , అన్నివర్గాల పేదలకు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేసి సమన్యాయం జరగాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు . ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలుపర్చాలని అనేక రూపాల్లో అనేకమార్లు అన్ని ఓసీ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వ , ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం మాత్రం శూన్యమన్నారు . రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జయపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఓసీలకు 10 శాతం రిజర్వేషన్లను రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలనే డిమాండ్ తో వచ్చే నెల జనవరి 31 న హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో వేలాది మందితో రాష్ట్రవ్యాప్త ఓసీల మహాగర్జన సభను భారీ ఎత్తున నిర్వహించనున్నామని , దీనికి జాతీయ అధ్యక్షులు నల్ల భాస్కర్ రెడ్డితోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు , ప్రజాప్రతిని ధులు , అన్ని ఓసీ కుల సంఘాల జేఏసీ నాయకులు , వివిధ పక్షాల నాయకులు హాజరవుతున్నారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఓ సి సంఘాల ఐకాస ఉమ్మడి వరంగల్ జోనల్ కమిటీ అధ్యక్షుడు పాడి గణపతి రెడ్డి రాష్ట్ర కార్యదర్శులు కామిడి సతీష్ రెడ్డి రావుల నరసింహారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షుడు కొల్గూరి రాజేశ్వరరావు ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రం శివశంకర్ కమ్మ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వి ఆర్ కే ప్రసాద్ ఉమ్మడి జిల్లా వైశ్య సంఘాల అధ్యక్షుడు వంగేటి అశోక్ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి సాయి శర్మ ఉమ్మడి జిల్లా ఐకాస కన్వీనర్ బోయినపల్లి పాపారావు జయహో రెడ్డి సంఘం జాతీయ ఇంచార్జి డా.సామల శశిధర్ రెడ్డి నాయకులు మొకిరాల జనార్ధన్ రావు మాడుగుల పాపిరెడ్డి వీసం సురేందర్ రెడ్డి కేశవ రెడ్డి దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 323 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.