ఈ నెల 11వ తేదీన వరంగల్ నగరానికి మంత్రి శ్రీ కిషన్ రెడ్డి రాక. .
1 min read
AAB NEWS:తెలంగాణ బ్యూరో బుర్ర కిరణ్ కుమార్
కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు ఈ నెల 11వ తేదీన ఉదయం రోడ్ మార్గాన వరంగల్ నగరానికి చేరుకుంటారు అని అనంతరం నగరంలో జరుగు కార్యక్రమాలలో పాల్గొంటారు అని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ గారు తెలియజేశారు. వరంగల్ అర్బన్ జిల్లా పర్యటనలో భాగంగా మొదట వరంగల్ భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకుంటారు అని అనంతరం కేంద్ర ప్రభుత్వ నిధులతో కేఎంసిలో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ను సందర్శిస్తారు అని అనంతరం హన్మకొండ న్యూ శాయంపేట లోనీ టివిఆర్ గార్డెన్స్ లో జరగనున్న బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేస్తారు అని అనంతరం రోడ్ మార్గాన హైదరాబాద్ వెళ్తారు అని రావు పద్మ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి పర్యటన విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రావు పద్మ గారు ఒక్క ప్రకటనలో తెలియజేశారు.
16 Total Views, 2 Views Today