AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఉచిత వృత్తి విద్యా శిక్షణా కేంద్రాలను ప్రారంభించిన సింగరేణి

1 min read

AABNEWS:BHUPALPALLY:తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

తేదీ 24.09.2021 ( శుక్రవారం ) రోజున సింగరేణి సేవా సమితి ఆద్వర్యంలో సింగరేణి
ప్రభావిత గ్రామాలైన వెంకటేశ్వర్లపల్లి & ధర్మరావు పేట లో ఉచిత వృత్తి విద్యా శిక్షణా కేంద్రాలను ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా SEWA (SINGARENI EMPLOYEES WIVES ASSOCIATION) అద్యకురాలు శ్రీమతి టి. జానకి శ్రీనివాస రావు – గారు హాజరయి టైలరింగ్ మరియు డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు.

వెంకటేశ్వర్లపల్లి కార్యక్రమం:


ముందుగా వెంకటేశ్వర్లపల్లి గ్రామం లో టైలరింగ్ మరియు డ్రైవింగ్ కోర్సులను ప్రారంభించడం
జరిగింది. ఈ సందర్భంగా SEWA అధ్యకురాలు శ్రీమతి టి. జానకి శ్రీనివాస రావు గారు
మాట్లాడుతూ – సింగరేణి ఇస్తున్న ఈ కోర్సులను శిక్షణార్ధులు చాలా శ్రద్ధగా నేర్చుకోవలసిందిగా కోరారు. కంపెనీ ఇస్తున్న ఇ ఉచిత శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో శిక్షణార్ధులు మరియు శిక్షకులు శ్రీమతి మహమూదా బేగమ్, డ్రైవింగ్ శిక్షకులు శ్రీ బుర్ర నాగరాజు పాల్గొనడం జరిగింది.


ధర్మరావు పేట కార్యక్రమం :-


అనంతరం ధర్మరావు పేటలో టైలరింగ్ కోర్సు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా
SEWA అధ్యక్షురాలు శ్రీమతి టి.
జానకి శ్రీనివాస రావు గారు మాట్లాడుత మహిళలు ఇట్టి కుట్టు శిక్షణలో సరిగ్గా శిక్షణ పొంది స్వయం శిక్షణ పొంది. స్వయం సంవృద్ధిని సాధించాలని కోరారు. ఎన్ని
పనులున్నప్పటికి శిక్షణకు తగిన సమయం కేటాయించవలసిందిగా కోరారు. ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడు వ్యక్తుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని, ఆత్మ విశ్వాసం గల వ్యక్తులు ఏదైనా సాధించడానికి అవకాశం వుంటుందని తెలిపారు.
శిక్షణ సమయంలో నేర్చుకోబోయే కుట్టు వస్త్రాలకు సంభంధించిన రికార్డులను
భద్రపరుచుకోవాలని చెప్పారు. అలాగే ఈ విద్యా కేవలం నేర్చుకునే వారకే పరిమితం కాకుండా భవిష్యత్తులో కూడా ఆర్థికపరంగా కుటుంభపోషణలో తమవంతు సహాయం చేకూర్చిన వారవుతారని తెలిపారు. మరియు శిక్షణ కేంద్రంలో ఏమైనా సమస్యలుంటే వారి దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో శ్రీమతి పి.ఆగమ్మ – సర్పంచ్ (దర్మరావు పేట) గారు, శ్రీ శివ కేశవ రావు
Dy.PM ఇంచార్జ్ అధికార ప్రతినిధి గారు మరియు శ్రీమతి ఆర్.కావ్య విజయప్రసాద్ – లేడీస్ క్లబ్ సెక్రెటరీ గారు, శ్రీ పి.
రాజేశం – Sr.PO గారు, శ్రీ కె. ప్రవీణ్ – సేవా కో ఆర్డినేటర్ గారు, సేవా సెక్రెటరీ శ్రీమతి పుష్పలత గారు, టైలరింగ్ శిక్షకురాలు శ్రీమతి సుజాత, సేవా సభ్యులు శ్రీమతి నాగలక్ష్మి, మనోహరి, కవిత మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 10,009 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.