AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఉన్న తాధికారులతో సమీక్షా సమావేశం

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

తేదీ 01.04.2021 రోజున స్థానిక జి యం కార్యాలయంలో ఉత్పత్తి, ఉత్పాదకత పై ఆయా గనుల
మరియు అన్ని విభాగాల ఉన్న తాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.
భూపాలపల్లి లో 10 మెగా వాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్ విద్యుత్ ప్లాంట్ ను రెండు నెలలో
ప్రారంభించడం జరుగుతుందని జి యం చెప్పారు. NCWA ఉద్యోగుల సౌకర్యార్ధం వేసవి కాలంలో సుమారుగా 85% ఉద్యోగుల ఇంటికి AC సౌకర్యార్ధం కొరకు విద్యుత్ సరఫరా పరికరాలను అమర్చడం జరిగింది. అలాగే 8 ఇంక్లెన్ కాలనీ లో గల 1000 క్వార్టర్స్ పరిసర ప్రాంతంలో గౌరవనీయులు తెలంగాణ ముఖ్య మంత్రి వర్యులు మరియు భూపాల్పల్లి నియోజక MLA గారి ఆదేశానుసారము రూ..200 కోట్ల తో 994 అదనపు
డబుల్ బెడ్రూం క్వార్టర్ల పనులు శరవేగంగా నిర్మించడం జరుగుతున్నాయని ఏరియా జంరల్ మేనేజర్ గారు
తెలియజేశారు.త్వరిత గతిన మరియు కాలుష్య నివారణ చర్యలలో భాగంగా బొగ్గు రవాణా కొరకై ఉప్పల్ రైల్వే స్టేషన్ నందు సైడింగ్ యార్లను నిర్మించే పనులు త్వరితగతిన జరుగుతున్నాయని GM గారు
పేర్కొన్నారు. అదేవిధంగా భూపాలపల్లిలో ప్రధాన మగజైన్ ను ఏర్పాటు చేయడానికి కార్పొరేట్ నుండి
అనుమతులు వచ్చాయని జియం గారు చెప్పారు.
అనంతరం జి యం గారు మాట్లాడుతూ – కేటికే 1 గ్రూప్ లో 2020-21 ఆర్ధిక సం.కి గాను OMS
1.08% కలిగి వుంది, మరియు అత్యధికంగా KTK 1 ఇంక్లైన్ లో 62% బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని
తెలియజేశారు. KTK – 1 గ్రూప్ స్థాయిలో 58% బొగ్గు ఉత్పత్తి సాధించింది. KTK-OC2 నుండి కోల్ గ్రేడ్
మిక్సింగ్ అనగా G5, 611 బొగ్గును ట్రెండింగ్ చేయగా దానిగ్ ఫలితముగా నాణ్యమైన 68 బొగ్గు సరఫరా
అవుతుందని చెప్పారు. రెండవ POP ప్లాంట్ ఇసుక రవాణా కొరకు KTK OC2 నందు ఏర్పాట్లు చేయడం
జరిగినది. మరియు కోల్ సీంలలో పంచ్ ఎంట్రీ రిలే కాంట్రాక్టు కూడా అమలు చేయడం జరిగింది.
KTK OC3 తేదీ 15.07.2020 రోజున ప్రారంభమై 0B వెలికితీత పనులతో పాటు 12.10.2020 రోజు
నుండి బ్లాస్టింగ్ పనులు కూడా ప్రారంభమైనవి. ఇప్పటి వరకు 92 లక్షల 36 వేల పై చిలుకు క్యూ.మీ. CB
ను వెలికి తీయడం జరిగండి పేర్కొన్నారు. తేదీ 05.03.2021 రోజున KTK OC3 నందు బొగ్గు నిక్షేపాలను
కనుగొనడం జరిగింది. ఇప్పటి వరకు 12093.82 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగింది.

వివిధ గనులు మరియు డిపార్ట్మెంట్లలో 89 CC TV కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది మరియు
అధనంగా 50 CC TV కెమెరాల ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని కూడా జి యం గారు
తెలియజేశారు.
2020-21 ఆర్ధిక సం.లో 2955 మంది కి సింగరేణి అంతర్గత ఉద్యోగులకు మరియు 700 మండి
కాంట్రాక్ట్ ఉద్యోగులకు స్థానిక GVTC నందు శిక్షణ ఇవ్వడం జరిగింది.
2020-2021 ఆర్ధిక సం.లో యజమాన్యం ఏరియా కు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేక పోవడానికి గల
ప్రధాన కారణాలు, COVID-19 వలన మూడు భూ గర్భ గనులకు లే – ఆఫ్ ప్రకటించడం, మరియు ఎన్నో
సార్లు గైర్హాజరు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసిన తదుపరి కూడా కార్మికుల గైరు హాజరు శాతం
ఎక్కువ వుండడం వలన నిర్దేశించి లక్స్యాన్ని చేరుకోలేకపోయామన్నారు.

2021-22 ఆర్ధిక సం.కి గాను భూపాలపల్లి ఏరియాకు సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యము 44.90 లక్షల
టన్నులుగా నిర్ణయించడమైనదని ఇట్టి లక్స్యాన్ని సమిష్టి కృషితో సాధించాలని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ
ఈ.సిహెచ్.నిరీక్షన్ రాజ్ గారు ఆకాంక్షించారు.

 994 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.