AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఉపాధ్యాయులను పట్టించుకునేది ఎప్పుడు

1 min read

AAB NEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

విషయ సూచనల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో గత ఐదున్నర సంవత్సరాలుగా ఏకీకృత సర్వీసు రూల్స్
సమస్య, నూతన జిల్లాల ఏర్పాటు తదితర కారణాలలో ఉపాధ్యాయుల పదోన్నతులు నిలిపివేశారు. వందలాది మంది
ఆర్హత గల సీనియర్ ఉపాధ్యాయులు పదోన్నతి పొందకుండానే ఉద్యోగ విరమణ పొందుతూ నష్టపోతున్నారు. పాఠశాలల్లో
ఛానోపాధ్యాయులు, సబ్జక్టు టీచర్ల కొరతతో విద్యార్థులు నష్టపోతున్నారు. 2019 ఫిబ్రవరిలో స్కూల్ అసిస్టెంట్స్ గా
ఆస్ట్రేడ్ చేసిన 10479 పండిట్, పీఈటీ పోస్టుల్లో ఆయా ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించనే లేదు. మోడల్ స్కూల్స్
ప్రారంభించి ఏడేళ్ళు గడిచినా ఒక్కసారి కూడా బదిలీ అవకాశం ఇవ్వలేదు. అంతర్రాష్ట్ర ఆంతర్షిల్లా, సాధారణ బదిలీలకోసం
ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు.
పై సమస్యల పరిష్కారం కోరుతూ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాజో), ఉపాధ్యాయ
సంఘాల పోరాట కమిటీ( యుయస్పీసీ) ఆధ్వర్యంలో వివిధ సందర్భాల్లో వినతి పత్రాలు సమర్పించి ఆందోళనలు
చేపట్టి ఉన్నారు. గత సంవత్సరం నవంబరులోనే తాత్కాలికంగా పాత పది జిల్లాలు యూనిట్ గా, యాజమాన్యం
వారీగా పదోన్నతులు చేపట్టాలని కోరుతూ గౌ?? విద్యాశాఖ మంత్రి గారికి, విద్యాశాఖ అధికారులకు ఉమ్మడి ప్రాతినిధ్యాలు
సమర్పించి చర్చించిన సందర్భంలో అంగీకరించారు కానీ ఏడాది గడిచినా పదోన్నతుల కల్పనకు చర్యలు తీసుకోలేదు.
ఈ కారణంగా ఉపాధ్యాయుల్లో నెలకొన్న తీవ్రమైన అసంతృప్తిని ప్రభుత్వం దృష్టికి తేవటం కోసం జాక్టో, యుయస్పీసీ
లు ఉమ్మడిగా రాష్ట్ర వ్యాప్త దశలవారీ పోరాట కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినవి.
ఆ క్రమంలోనే ఈరోజు (2020 డిసెంబర్ 17 న) జయశం. భూపాలు జిల్లా కేంద్రంలో ఉ
పాధ్యాయులు సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించి నిరసన తెలిపారు. కనుక ప్రభుత్వం వెంటనే ఈ క్రింది
సమస్యలను పరిష్కరించి ఉపాధ్యాయుల ఆందోళనను నివారించాలని కోరుతున్నాము.
తక్షణమే పరిష్కరించాల్సిన సమస్యలు:

  1. అప్లైడెడ్ పండిట్, పీఈటీ పోస్టులతో సహా ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఖాళీల్లో పాత పది జిల్లాల
    ప్రాతిపదికన యాజమాన్యం వారీ పదోన్నతుల కల్పనకు షెడ్యూల్ విడుదల చేయాలి.
  2. పదోన్నతులతో పాటే సాధారణ బదిలీలు నిర్వహించాలి.
  3. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి.
  4. ఉపాధ్యాయుల అంతర్రాష్ట్ర, అంతర్డిల్లా బదిలీలకు అనుమతించాలి.
  5. పాఠశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీకి టిఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వాలి

 20 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.