ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన పోటీ…
1 min readAABNEWS : తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన పోటీ చేస్తాయని బీజేపీ నేత సోము వీర్రాజు ప్రకటించారు. సోమవారం రామతీర్థంలో నిరసన తెలుపుతామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయాలపై దాడులు రాజకీయ అంశం కాదని, ఆత్మాభిమానం, స్వాభిమానానికి సంబంధించిన అంశమని అన్నారు. కమలదళంలో ‘దుబ్బాక’ విజయం ఎంతో ఉత్సాహం నింపింది. ఇదే దూకుడుతో భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికకు సమాయత్తం అవుతోంది. సోము వీర్రాజు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దియోదర్ల నేతృత్వంలో ఉపఎన్నిక వ్యూహరచనపై నాయకులు సమావేశం అవుతున్నారు. ఇదే సమయంలో మరో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం సైతం ఈ ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుండటంతో పార్లమెంట్ పరిధిలో రాజకీయం మెల్లమెల్లగా వేడెక్కుతోంది. మరోవైపు అధికార వైసీపీ నుంచి టిక్కెట్టు ఆశిస్తూ పలువురు ఆశావహులు పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని కలుస్తున్నారు.
107 Total Views, 2 Views Today