ఉలి పడితే చాలు…
1 min read
AABNEWS : హుజూరాబాద్ పట్టణ సమీపంలో ‘కంది’ వారు కొన్నేళ్లుగా తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు… వైవిధ్య భరిత రాతివిగ్రహాలను రూపొందిస్తున్నారు. బండరాళ్లను తీర్చిదిద్దుతూ అబ్బురపరుస్తున్నారు…వంశపారంపర్యగా వచ్చిన ఈ కళను ఉపాధిగా మార్చుకున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా పలు రకాల విగ్రహాలకు ప్రాణం పోస్తున్నారు. రూ.వెయ్యి నుంచి రూ.లక్ష ధరపలికే విధంగా విగ్రహాలను రూపొందించడం విశేషం..మహారాష్ట్ర నుంచి 20ఏళ్ల కిందటే చేరుకున్న పలువురు తాము ఉపాధి పొందుతూ మరో యాభై కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నారు. అంజన్న విగ్రహం నుంచి మొదలుకుని ముక్కోటి దేవతామూర్తుల విగ్రహాలను అలవోకగా తయారు చేసి చూపుతున్నారు.రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, గౌతమ బుద్దుడు, ఆదికవి నన్నయ, అంజన్న, బతుకమ్మ, నవగ్రహాలు, వినాయకుడు, శివలింగం, శ్రీసీతారామచంద్రమూర్తులు, సమ్మక్క- సారలమ్మ, దుర్గామాత, మహానంది, మహనీయులు, తదితర విగ్రహాలను చేతితో చెక్కుతూ తయారుచేస్తున్నారు. విజయవాడ- మాటూరు, కరీంనగర్- బావుపేట, ఇతర ప్రాంతాల నుంచి నల్లరాళ్లు, పాలరాళ్లను తీసుకొచ్చి తయారు చేస్తున్నారు.
50 Total Views, 2 Views Today