AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఊరుకోసం కలిసి పోరాడుదాం గూడూరు శ్రీమంతుడు కనుమూరి హరిశ్చంద్ర రెడ్డి పిలుపు…

1 min read

AABNEWS : చారితాత్మకంగా గుర్తింపు పొందిన గూడూరులో కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు కలిసి ఒంటెద్దు పోకడలు సాగించడం హేయమైన చర్యలు అనీ అలాంటి పోకడలు ఇంకపై సాగవు అనీ గూడూరు శ్రీమంతుడు కనుమూరి హరిశ్చంద్ర రెడ్డి హెచ్చరించారు, బుధవారం గూడూరు పట్టణంలోని సొసైటీ కాలనీ లో ఉన్న రోటరీ భవనం నందు అన్నీకులాలు,మతాలకు చెందిన నాయకుల తో కలిసి గూడూరు శ్రీమంతుడు కనుమూరి హరిశ్చంద్ర రెడ్డి గూడూరు అభివృద్ధి కోసం సరి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ “గ్రేటర్ గూడూరు డెవలప్మెంట్ అసోసియేషన్” ను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాశం సునిల్ కుమార్ తో పాటు అన్నీ కులాల,మతాలకు చెందిన నేతలు పాల్గున్నీ వారి వారి మనోభావాలు వ్యక్తం చేశారు, మొదటిగా గూడూరు శ్రీమంతుడు కనుమూరి హరిశ్చంద్ర రెడ్డి మాట్లాడుతూ గూడూరు పట్టణానికి ఎంతో చారితాత్మకంగా గుర్తింపు ఉంది అన్నారు,గూడూరు అభివృద్ధి లో ఎంతోమంది దాతలు భాగస్వామ్యం అయ్యి గూడూరు ను అన్నీ విధాల అభివృద్ధి చేశారు అని ఆయన వెల్లడించారు.

గూడూరులో ఉన్న అల్లూరి అదిశేషారెడ్డి స్టేడియం,డి ఎన్ ఆర్ కమ్యూనిటీ హాల్,డి ఆర్ డబ్ల్యు కళాశాల, టవర్ క్లాక్,జిల్లా పరిషత్ బాలుర,బాలికల ఉన్నత పాఠశాలలు, పి ఆర్ క్లబ్,సి ఎస్ పార్క్,రోటరీ భవనలకు,ఇతరత్రా భవనాలకు సైతం ఎన్నో స్థలాలు దాతృత్వం చేసి కట్టడాలు చేపట్టారు అన్నారు.

ముఖ్యంగా గూడూరు పట్టణంలో టవర్ క్లాక్ నిర్మాణం గతంలో జి ఎస్ రాయల్ వారి దాతృత్వంలో నిర్మించారు అనీ, అదేవిధంగా ఆనాడు బాటసారుల కోసం పుల్లమ్మ,కామాక్ష్మమ్మ దాతృత్వం లో సత్రాలు నిర్మించారు అనీ ఇవీ అన్నీ కూడా దశబ్దాలు దాటడంతో శిథిలావస్థకు చేరడంతో ప్రజా ప్రతినిధులు, అధికారులు వాటిని కూల్చివేసి నూతన కట్టడాలు కట్టడం చేపట్టడం మంచిదే కానీ, ఆ స్థలాలు ఆనాడు దాతృత్వం చేసిన కుటుంబ సభ్యులకు తెలియకుండా పనులు చేయడం హేయమైన చర్యలు అనీ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

ప్రజా ప్రతినిధులు, అధికారులు చేపడుతున్న ఇలాంటి పనులు వల్ల సభ్య సమాజం తలదించుకునేలా ఉంది అన్నారు, గతంలోనే గూడూరు టవర్ క్లాక్,గూడూరు పట్టణ ముఖద్వారం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసి డిజైన్ లు సిద్ధం చేశాం అనీ, కానీ నేడు ప్రభుత్వ అధికారులు చేపడుతున్న పనుల్లో దాతల ను భాగస్వామ్యం చేయకపోవడం చాలా బాధాకరం అన్నారు,ఇలాంటి ఒంటెద్దు పోకడలు అడ్డుకొనేందుకు కుల, మతాల,రాజకీయ పార్టీల కు అతీతంగా గ్రేటర్ గూడూరు డెవలప్మెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసి తద్వారా గూడూరు ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం అని ఆయన ప్రకటించారు.

అసోసియేషన్ నిర్వహణకు హరిశ్చంద్ర రెడ్డి లక్ష రూపాయలు ప్రకటించారు, అదేవిధంగా న్యాయవాదీ గోపీనాధ్ 50 వేలు, బీజేపీ నేత బాలయ్య 10 వేలు విరాళం ప్రకటించారు, అదేవిధంగా సమావేశంలో టవర్ క్లాక్,గూడూరు పట్టణ ముఖద్వారం డిజైన్లు ప్రదర్శించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పాశం సునిల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు అభివృద్ధి కి పార్టీలకు అతీతంగా గ్రేటర్ గూడూరు డెవలప్మెంట్ అసోసియేషన్ ఏర్పాటు అభినందనీయం అన్నారు,ఈ అసోసియేషన్ కు అన్నీ విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆడిటర్ రామ్మోహన్,రోటరీ అధ్యక్షుడు దశరథ రామిరెడ్డి, బీజేపీ నేత బాలయ్య,ఆర్యవైశ్య నేత సుధాకర్,న్యాయవాదీ గోపీనాధ్,హనుమంతరావు,నాశన భాస్కర్ గౌడ్,దేవా, అహ్మద్ రియాజ్ ,పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

 252 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.