ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ టీఆర్ఎస్
1 min read
AAB NEWS : హైదరాబాద్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 4,700 ఎకరాలున్న హుస్సేన్‌సాగర్ ఇవాళ 700 ఎకరాలు కూడా లేదన్నారు. అక్రమ కట్టడాలను కూల్చేస్తామంటున్నారని.. అలా అయితే హుస్సేన్‌సాగర్ కట్టపై ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. మళ్లీ ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ మాయ మాటలు చెబుతోందన్నారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ తోక ఎలా తొక్కాలో తమకు తెలుసునని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
46 Total Views, 2 Views Today