ఎఫైర్ కోసం సొరంగం…
1 min read
AABNEWS : వివాహేతర సంబంధం కోసం చేసిన పని ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఏకంగా తన ఇంటి బెడ్రూం నుంచి సీక్రెట్ ఎఫైర్ పెట్టుకున్న వివాహిత ఇంటి బెడ్రూంకు సొరంగ మార్గాన్ని తవ్వాడు. దీని ద్వారా వారిద్దరూ తమ భాగస్వాములకు తెలియకుండా గత కొంతకాలంగా అక్రమసంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, పరాయి వ్యక్తితో ఇలా వివాహేతర సంబంధం నేర్పుతున్న మహిళ భర్త ఒకరోజు డ్యూటీ నుంచి త్వరగా ఇంటికి రావడంతో ఈ విషయం బయటపడింది. మరో వ్యక్తిని తన పడక గదిలో చూడడం.. సదరు వ్యక్తి పడక గది నుంచి ఉన్నట్టుండి మాయం కావడంతో భర్తకు అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆ వ్యక్తి ఎలా మాయం అయ్యాడని గమనించగా బెడ్డు కింద పెద్ద హోల్ కనిపించింది. దానిని తెరిచి చూస్తే సొరంగం ద్వారం బయటపడింది. దాని గుండా వెళ్లిన మహిళ భర్త.. సరాసరి తన భార్యతో ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తి ఇంట్లోని పడక గదికి చేరాడు. అనంతరం వారిద్దరూ ఘర్షణ పడడంతో ఇరుగుపొరుగు వారికి తెలిసింది. దీంతో ఈ విషయం వార్తలోకి ఎక్కింది. వివరాల్లోకి వెళ్తే.. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే అల్బర్టో అనే వ్యక్తి ఇలా తన పొరుగున ఉండే వివాహిత ఇంటికి సొరంగ మార్గం తవ్వి.. కొన్నాళ్లుగా వివాహేతర సంబంధాన్ని నేర్పుతున్నాడు. తన బెడ్రూం నుంచి వివాహిత పడక గదికి సొరంగ మార్గాన్ని తవ్వాడు అల్బర్టో. ఆమె భర్త నైట్ డ్యూటీలకు వెళ్లిన సమయంలో వారిద్దరూ ఏకాంతంగా కలుసుకునేవారు. అయితే, ఒకరోజు డ్యూటీ నుంచి ఆమె భర్త త్వరగా ఇంటికి రావడంతో వారి బండారం బయటపడింది. ఇంటికి వచ్చిన భర్తకు భార్య ప్రవర్తనలో మార్పు కనిపించడంతో పాటు అదే సమయంలో పడక గదిలో ఏదో అలికిడి వినిపించింది. అనుమానంతో బెడ్డు కింద తొంగి చూసిన భర్తకు అల్బర్టో నక్కి ఉండడం కనిపించాడు. కానీ, క్షణాల వ్యవధిలోనే అతడు అక్కడి నుంచి మాయం అయ్యాడు. దాంతో బెడ్డు కింద పరిశీలించి చూసిన భర్తకు ఓ రంధ్రం కనిపించింది. దానిపై కప్పి ఉంచిన తెరను తెరిచి చూస్తే సొరంగ మార్గం ద్వారం దర్శనమిచ్చింది. ఆ సొరంగ మార్గాన్ని అనుసరించి వెళ్లిన అతనికి.. అది అల్బర్టో బెడ్ రూంకు తీసుకెళ్లింది. ఇక తన తప్పును ఒప్పుకున్న అల్బర్టో తన భార్యకు ఈ విషయాన్ని చెప్పొద్దని బతిమాలాడు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న మహిళ భర్త అల్బర్టోను చితకబాదాడు. ఇద్దరు ఘర్షణ పడడం చూసి స్థానికులు గుమిగూడారు. దీంతో విషయం కాస్తా పోలీసులకు వరకు వెళ్లింది. తన భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్న అల్బర్టోపై భర్త ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు అల్బర్టోను అదుపులోకి తీసుకున్నారు
59 Total Views, 2 Views Today