ఎమ్మెల్సీ చరిత్రలో తొలిసారి మహిళా టీచర్ ఆరంగేట్రం
1 min read
AABNEWS : టీచర్స్ ఎమ్మెల్సీ చరిత్రలో తొలిసారి మహిళా టీచర్ ఆరంగేట్రం విసన్నపేట నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి నేటి నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో మహిళా ఉపాధ్యాయురాలు ఎమ్మెల్సీ ఎన్నికల రేసులో అడుగు పెట్టటం ఇదే తొలిసారి అని స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరిగిన ఉపాధ్యాయ సమావేశంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపెన్ లో భాగంగా పి ఆర్ టి యు సేవాదళ్ కన్వీనర్ డి శ్రీనివాసరావు మాట్లాడారు. ఎమ్మెల్సీ ఉపాధ్యాయ పోటి అభ్యర్థిని టీ కల్పలత మాట్లాడుతూ పి ఆర్ టి యు యూనియన్ తో పాటు 43 ఉపాధ్యాయ యూనియన్ లు మద్దతుతో మీ ముందుకు వచ్చానని తొలి ప్రాధాన్యత ఓటును 14వ తేదీన జరిగే ఎన్నికలలో తనకు వేయవలసిందిగా ఆమె అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు పెండెం వెంకట రామకృష్ణ, ఆర్ వి శోభన్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రెడ్డి, జి వెంకటేశ్వర రావు , తోకల శ్రీరామమూర్తి,జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం వెంకటేశ్వరమ్మ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
1,000 Total Views, 2 Views Today