AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎసీబీ వలలో హీరోలు…

1 min read

AABNEWS : ఆదిలాబాద్​ లో సోమవారం మూడు అవినితి చేపలు అవినితి నిరోదక శాఖ అధికారులకు చిక్కాయి. ఆర్వో ప్లాంట్​ కు నూతన కనెక్షన్​, కొత్త మీటర్​ అందించేందుకు బండారి సంతోశ్​ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండుగా విద్యుత్​ శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులను సోమవారం ఎసీబీ అధికారులు రెడ్​ హ్యండెడ్​ గా పట్టుకున్నారు. పట్టణంలోని తిరుపల్లిలో ఆర్వో ప్లాంట్​ కోసం కరెంట్​ కనెక్షన్​ ఇవ్వాలని బండారి సంతోశ్​ విద్యుత్​ శాఖ అధికారులను సంప్రదించాడు. విద్యత్​ కమర్షయల్​ ఎఈ శ్రీనివాస్​, ఏఈఈ కృష్ణరావ్​, లైన్​ మెన్​ ప్రకాశ్​ లు రూ.55వేలు డిమాండ్​ చేశారు. అయితే బాదితుడు ఈ ముగ్గురు అధికారులకు డబ్బులు ఇచ్చాడు. ఇంకా రూ.15వేలు ఇవ్వాల్సి ఉండగా డబ్బుల కోసం వేధించడంతో బండారి సంతోశ్​ను ఎసీబీని ఆశ్రయించాడు. ఎసీబీ అధికారులు సోమవారం ముగ్గురు ఉద్యోగులు నగదు డబ్బు తీసుకుంటుండగా రెడ్​ హ్యండెడ్​ గా పట్టుకున్నారు. కమర్షయల్​ ఎఈ శ్రీనివాస్​, ఏఈఈ కృష్ణరావ్​, లైన్​ మెన్​ ప్రకాశ్​ ల నుంచి నగదు స్వాధినం చేసుకోని అదుపులోకి తీసుకున్నారు. ఎసీబీ డిఎస్పీ భద్రయ్య నాయకత్వంలో జరిగిన ఈ దాడిలో సీఐలు తిరుపతి, నర్సింహ, రవీందర్​, రాము, సంజీవ్​ లు పాల్గోన్నారు.

 1,125 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.