September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఏబిసిడి వర్గీకరణకు నిర్విరామ కృషి…

1 min read

AABNEWS : ఎమ్మార్పీఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పెద్దల ఆనంద్ కుమార్ మాదిగ
కొడంగల్:
రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు కల్పించిన హక్కులను పొందేందుకు ఏబిసిడి వర్గీకరణ తో సంపూర్ణ అభివృద్ధి సాధిస్తామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఆనంద్ కుమార్ మాదిగ అన్నారు సోమవారం వికారాబాద్ జిల్లా బొమ్మరాసిపేట మండలం రేగడి మైలారం లో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీని నూతనంగా ఏర్పాటు చేసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగ హక్కుల కు కు సాధన కోసం ఆవిర్భవించిన మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ఆవిర్భవించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గ్రామ స్థాయి వరకు విస్తృతం చేస్తూ మాదిగలను ఐక్యం చేయడం చైతన్యపరచడం ఎబిసిడి వర్గీకరణ కోసం అం సాధించుకునేందుకు నిరంతర కృషి చేస్తున్నామని ఆయన అన్నారు ఈ నెల 8 న కొడంగల్ తాలూకా కేంద్రంలో జరిగే భారీ బహిరంగ సభకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్యఅతిథిగా విచ్చేయుచున్న వారని తెలిపారు జిల్లాలోని మాదిగ బిడ్డలు అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మౌనం పాటించి నివాళులు అర్పించారు అమరులైన మాదిగల మాదిగల హక్కుల కోసం పోరాడిన పోరాటాల గురించి సేవల గురించి కొనియాడుతూ వారి సేవలను స్మరించుకున్నారు ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటి గా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సి విజయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా హనుమంతు, ప్రధాన కార్యదర్శిగా షేరీ సాయిలు, సహాయ కార్యదర్శిగా టి రాజేష్, కోశాధికారిగా కె వెంకట్ రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాదిగల హక్కుల కోసం సమస్యల పరిష్కారం కోసం తమ వంతు నిరంతరం కృషి చేసి సాధించుకుంటామని నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎం శ్రీనివాస్ డి యేసు, గ్రామ పెద్దలు దొడ్డప్ప, బసప్ప, దాసరి రాములు, దాసరి చంద్రప్ప, చిన్న నరసింహులు, శ్రీనివాస్, లక్షప్ప, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

 242 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.