AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఒమేగా హాస్పిటల్స్ వారిచే నిర్వహించబడ్డ ఈ కార్యక్రమంలో…

1 min read

AABNEWS : జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ…ఒమేగా హాస్పిటల్స్ వారిచే నిర్వహించబడ్డ ఈ కార్యక్రమంలో చాలా గొప్ప కార్యక్రమం అని అన్నారు.విధి నిర్వహణ ఉండిపోయి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదని అన్నారు.ముందుగా గుర్తించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల నుండి సులువుగా బయట పడొచ్చని ఆయన అన్నారు. పోలీస్ శాఖ నుండి మొత్తం 75 మంది మహిళ పోలీస్ సిబ్బంది చెక్ అప్ లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ,ఒమేగా బన్ను హాస్పిటల్స్ మేనేజింగ్ అండ్ మెడికల్ డైరెక్టర్ వి.చరంజిత్ రెడ్డి డి.ఎం.హెచ్.ఓ శ్రీరామ్ ,ఏరియా హాస్పిటల్ సుపెరింటెండెంట్ వెంకటరామ్ ,ఐ.ఎం.ఏ ప్రెసిడెంట్ రూప్ లాల్ ,ఐ.ఆర్.సి.ఎస్ స్టేట్ ఎమ్.సి & ఈ.సి మెంబర్ ఈ.వి.శ్రీనివాస్ రావు ఐ.ఎం.ఏ సెక్రటరీ వినీల్ రెడ్డి, బాలు నాయక్ డా. ఆలేటి రవీందర్ రెడ్డి ,డా.నిఖిల్ కుమార్ ఆత్మకూరు ,వర ప్రసాద్.పోలీస్ మహిళ సిబ్బంది పాల్గొన్నారు.మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి నేతృత్వంలో మహిళా పోలీసు ఉద్యోగులకు మరియు జిల్లా మహిళా అధికారిణిలకు ఒమేగా బన్ను క్యాన్సర్ మరియు క్రిటికల్ కేర్ హాస్పటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి ఎన్ కోటిరెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి అనేది ముందస్తుగా గుర్తించడం ద్వారా ప్రాణాంతకం కాదని, క్యాన్సరు కలుగజేసే పదార్థాలకు దూరంగా ఉండటం మరియు అవగాహన మాత్రమే క్యాన్సర్ కు గురికాకుండా నిర్మూలించగలదని అన్నారు. కుటుంబ సభ్యులలోని మహిళలకు క్యాన్సర్ పైన అవగాహనా కల్పిస్తూ, ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి మొహమాటానికి వెళ్ళకుండా క్యాన్సర్ టెస్టులు చేయించుకోవాలని అన్నారు. ఒత్తిడి కూడా క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం అని ఎస్పి అన్నారు. పోలీసు ఉద్యోగంలో ఒత్తిడికి గురి కాకుండా మీ కుటుంబం సభ్యుల లోని మహిళలందరికీ క్యాన్సర్ నిర్మూలన పై అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాని అని ఎస్పి గారు అన్నారు. మహిళలు వారి నిత్య కృత్యాలతో అహర్నిశలు శ్రమిస్తూ వారి ఆరోగ్యం పైన శ్రద్ద చూపకుండా నిర్లక్ష్యానికి గురై ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలమీదికి తెచుకుంటున్నారు అని అన్నారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం వలన వారి కుటుంబానికి అతి పెద్ద నష్టం జరుగుతుందని, వ్యాధిని ముందస్తుగా గుర్తించి చర్యలు తీసుకుంటే నిర్మూలన సాధ్యం అని వారు అన్నారు.జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ…ఒమేగా హాస్పిటల్స్ వారిచే నిర్వహించబడ్డ ఈ కార్యక్రమంలో చాలా గొప్ప కార్యక్రమం అని అన్నారు.విధి నిర్వహణ ఉండిపోయి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదని అన్నారు. ముందుగా గుర్తించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల నుండి సులువుగా బయట పడొచ్చని ఆయన అన్నారు. పోలీస్ శాఖ నుండి మొత్తం 75 మంది మహిళ పోలీస్ సిబ్బంది చెక్ అప్ లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ,ఒమేగా బన్ను హాస్పిటల్స్ మేనేజింగ్ అండ్ మెడికల్ డైరెక్టర్ వి.చరంజిత్ రెడ్డి డి.ఎం.హెచ్.ఓ శ్రీరామ్ ,ఏరియా హాస్పిటల్ సుపెరింటెండెంట్ వెంకటరామ్ ,ఐ.ఎం.ఏ ప్రెసిడెంట్ రూప్ లాల్ ,ఐ.ఆర్.సి.ఎస్ స్టేట్ ఎమ్.సి & ఈ.సి మెంబర్ ఈ.వి.శ్రీనివాస్ రావు ఐ.ఎం.ఏ సెక్రటరీ వినీల్ రెడ్డి, బాలు నాయక్ డా. ఆలేటి రవీందర్ రెడ్డి ,డా.నిఖిల్ కుమార్ ఆత్మకూరు ,వర ప్రసాద్.పోలీస్ మహిళ సిబ్బంది పాల్గొన్నారు.

 106 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.