September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఓటుకు నోటు

1 min read

భూపాలపల్లి, మార్చి 14: నల్గొండ, వరంగల్‌, ఖమ్మం ఉమ్మడిజిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒక ప్రధాన పార్టీ తెరాసా వారు ఆదివారం భూపాలపల్లి పట్టణ లో ఓట్లకు కరెన్సీ నోట్లు పంపిణీ చేశారు. ఆపార్టీ అధినాయకత్వం చివరికి ఒక నిర్ణయం తీసుకొని మండలస్థాయి నాయకత్వానికి పంపించిన నిధుల మేరకు కొంతమంది పట్టభద్రులకు కరెన్సీ నోట్లు పంపిణీ చేశారు. ఓటర్స్ సీరియల్ నంబర్ నమోదు చేసుకొని ఓటర్లు అయిన పట్టభద్రులకు బూత్ స్థాయి లో ఉన్న పట్టభద్రులకు రూ.వెయ్యి చొప్పున డబ్బు పంపిణీ చేశారు. గ్రామంలోని ఇద్దరు, ముగ్గురు నాయకులకు ఈ డబ్బు పంపిణీ బాధ్యత అప్పగించారు. ఓటర్లైన పట్టభద్రుల ఆధార్‌కార్డు, ఓటు సీరియల్‌ నెంబర్‌ తదితర వివరాలను నమోదుచేసుకొని వారికి డబ్బులు పంపిణీ చేశారు. ఆదివారం ఉదయం నుంచి ఈ డబ్బు పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఆలస్యంగా పోలిస్ లు సమాచారం అందడంతో ప్రజా ప్రతినిధులు అక్కడినుండి పరార్ అయినారు మిగిలిన అభ్యర్థులు వెనుదిరిగి పోయారు మొదట ఒక్కో పట్టభద్రుడికి రూ.1000రూ చొప్పున డబ్బు పంపిణీ చేస్తారని ప్రచారం జరిగింది. చివరికి వారికి రూ.500చొప్పున, పంపిణీ చేయటంతో ఎక్కువ మొత్తంలో ఆశించిన ఓటర్లు తీవ్ర నిరాశకు లోనైనట్లు ప్రచారం జరుగుతుంది.
ఓటుకు నోటుకోసం పరుగులు తీస్తున్న ఓటర్లు

 1,200 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.