కత్తితో భార్య గొంతు కోసిన భర్త…
1 min read
AAB NEWS : చంద్రగిరి నియోజకవర్గం,రామచంద్రాపురం మండలం,అనుప్పల్లి పంచాయతీలో విషాదం చోటుచేసుకుంది. గడ్డక్రింద పల్లిలో కుటుంబ కలహాల కారణంగా భార్యభర్తలు ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. భార్య సంఘటన స్థలంలోనే మృతి చెందగా భర్త కొన ఊపిరితో ఆసుపత్రి పాలయ్యాడు.రామచంద్రపురం మండలం, గడ్డక్రిందపల్లెకు చెందిన వెంకటేష్ రెడ్డి యాడాది క్రితం చౌడేపల్లికు చెందిన శిరీషను రెండవ వివాహం చేసుకున్నాడు. తిరుపతి సమీపంలోని చెర్లోపల్లిలో కాపురం ఉండే భార్యభర్తలు కుటుంబ కలహాలతో స్వగ్రామానికి చేరుకున్నారు. ఆదివారం రాత్రి గ్రామ సమీపంలోని మామిడి తోటలో వెంకటేష్ రెడ్డి కత్తితో భార్య శిరీష గొంతు కోసి ఆపై తను కూడా ఆత్మహత్యాయత్నకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో శిరీష అక్కడికక్కడే మృతి చెందింది.అయితే వెంకటేష్ రెడ్డి కొన ఊరిపితో ఉండడంతో స్థానికులు 108 కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంకటేష్ రెడ్డిని హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వెంకటేష్ రెడ్డి మానసిక స్థితి గతకొంత కాలంగా సరిగా లేదని స్థానికులు చెపుతున్నారు.
38 Total Views, 2 Views Today