AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

భారీగా అద్ధె. ఖాళీగా దుకాణాలు…

1 min read

AAB NEWS :

మున్సిపల్‌ అతిథి గృహంలో ఖాళీగా ఉన్న దుకాణాలు

నగర నడిబొడ్డున.. నిత్యం రద్దీ ప్రదేశంలో ఉన్న నగరపాలక మడిగెలు అద్దెకిస్తామంటే ఎవరూ ముందుకు రావడం లేదు. ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంతో ఆ దుకాణాల పరిస్థితి దారుణంగా మారింది. పైగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దుకాణాలన్నీ వాణిజ్య ప్రాంతంలోనే ఉండగా ఖాళీగా ఉన్న వాటికి వేలంపాట నిర్వహించకపోవడం, పలుమార్లు నిర్వహిస్తే స్పందన లేకపోవడంతో సముదాయాలు ఖాళీగానే ఉంటున్నాయి.

భారీగా అద్ధె. ఖాళీగా దుకాణాలు మున్సిపల్‌ అతిథి గృహం మొదటి అంతస్థులో దుకాణాలు నిర్మించారు. కింద పార్కింగ్‌ కోసం స్థలం వదిలారు. ఏ ప్రణాళిక ప్రకారం దీన్ని నిర్మించారో ఇప్పటికి ఎవరికీ అర్థం కాకుండా మారింది. రోడ్డు వైపు ఒక్క దుకాణం ఉన్నట్లు కన్పించదు. పైగా కొన్ని దుకాణాలు చీకటిగా ఉంటాయి. ప్రైవేటు భవనాల కంటే మున్సిపల్‌ అతిథి గృహంతో పాటు ఇతర దుకాణాల అద్దె ఎక్కువగా ఉంది. సర్కార్‌ నిర్ణయించిన ధరనే ఎక్కువగా ఉండటం, మొదటి అంతస్థులో దుకాణాలుండటం, వ్యాపారాలు చేసుకోవడానికి అనువుగా ఉండటం లేదనే కారణం, అంతేకాకుండా అద్దె ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇందులో రోడ్డు వేయకపోవడం, కింది భాగంలో మురుగునీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. కనీసం శుభ్రంగా ఉంచి, రాత్రివేళలో భవనానికి లైటింగ్స్‌తో వెలుగులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటే ఆ వైపు అందర్ని ఆకర్షించనుంది.

బల్దియాకు రూ.కోట్లు నష్టం

మున్సిపల్‌ దుకాణాలు ఖాళీగా ఉండటంతో గత నాలుగేళ్లుగా రూ.కోట్ల ఆదాయం రాకుండా పోయింది. ఈ లెక్కన పరిశీలిస్తే నగరపాలికకు నష్టం వచ్చినట్లే. వాణిజ్య, వ్యాపార కూడలిలో ఉన్న ఈ మడిగెలు ఖాళీగా ఉండటం, నిర్వహణ లేకపోవడంతో అధ్వానంగా మారుతున్నాయి. ప్రస్తుతం స్మార్ట్‌సిటీ పనులు నడుస్తుండగా వీటిని ఉపయోగించుకుంటుండగా మిగతా సమయాల్లో నయాపైసా రావడం లేదు. దుకాణాల సముదాయంతో పాటు పాసుపోర్టు కార్యాలయం కింద, మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఉన్న దుకాణాల సముదాయంలో ఐడీఎస్‌ఎంటీ పథకంతో నిర్మించిన రెండవ అంతస్థులోని దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. మున్సిపల్‌ అతిథి గృహ సముదాయంలో 35 దుకాణాలు ఉన్నాయి. వేర్వేరుగా అద్దెకు తీసుకోవడం అసాధ్యంగానే అనిపిస్తోంది. గతంలోనే మూడుసార్లు వేలంపాట నిర్వహించినా ఒక్క దుకాణం అద్దెకు పోలేదు. ఒకరిద్దరూ వచ్చినా మార్కెట్‌ ధర కంటే అద్దె ఎక్కువగా ఉందంటూ వెనక్కి తగ్గారు. ఇలా ఒకరిద్దరూ వస్తే మొత్తం దుకాణాలు అద్దెకు వెళ్లే అవకాశం లేదు. ఒకే సంస్థకు ఇచ్చేలా నిబంధనలు సడలిస్తే నగరపాలకకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పైగా కొన్ని ఏళ్ల వరకు ఖాళీ ఉండే అవకాశమే ఉండదు.

 65 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.