కరోనా కేసులు..పదివేల దిగువకు…
1 min read
AABNEWS : ముందురోజు కంటే 23 శాతం తగ్గుదల..78 మరణాలు
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య అదుపులోనే ఉంటుంది. కొత్తగా 9,110 కేసులు వెలుగు చూడగా..క్రితం రోజుతో పోల్చుకుంటే 23 శాతం తగ్గుదల కనిపించింది. తాజాగా 78 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,08,47,304 మంది కొవిడ్ బారిన పడ్డారు. అలాగే మొత్తం మరణాల సంఖ్య 1,55,158కి చేరిందని మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.క్రియాశీల కేసుల్లో తగ్గుదల, రికవరీల్లో పెరుగుదల కొనసాగుతోంది. మొత్తంగా 1,43,625 క్రియాశీల కేసులుండగా..ఆ రేటు 1.32శాతానికి చేరింది. గడిచిన 24 గంటల్లో 14,016 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్నటివరకు 1,05,48,521 మంది వైరస్ను జయించగా..ఆ రేటు 97.25 శాతానికి పెరిగింది. ఇక, ఫిబ్రవరి 8 నాటికి 20,25,87,752 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. నిన్న ఆ పరీక్షల సంఖ్య 6,87,138గా ఉంది..
140 Total Views, 2 Views Today