AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కరోనా మాత పేరిట ఆలయాన్ని నిర్మించారు…

1 min read

AAB NEWS : విలయతాండవం చేస్తున్న మహమ్మారి నుంచి రక్షించాలంటూ ఉత్తరప్రదేశ్ లోని శుక్లాపూర్ గ్రామ ప్రజలు కరోనా మాతను ప్రార్థిస్తున్నారు. వారు కరోనా మాత పేరిట ఆలయాన్ని నిర్మించారు. గ్రామస్తులు చందాలు వేసుకుని ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. ఓ వేప చెట్టు వద్ద ఉండే ఈ కరోనా అమ్మవారి మందిరానికి ప్రజలు తండోపతండాలుగా వస్తుండడం విశేషం. ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ, భక్తులకు తీర్థప్రసాదాలు కూడా పంచిపెడుతున్నారు.

దీనిపై గ్రామస్తులు స్పందిస్తూ…  ప్రాణాంతక కరోనా వైరస్ వేలాది మంది ప్రజలను పొట్టనబెట్టుకుంటోందని, అందుకే తాము కరోనా మాత ఆలయం నిర్మించామని వెల్లడించారు. అమ్మవారి ప్రార్థిస్తే కరోనా బారి నుంచి తప్పక రక్షిస్తుందన్న సంపూర్ణ విశ్వాసంతో ఉన్నామని తెలిపారు.

 217 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.