AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కళాకారులను ఆదుకుంటాం..

1 min read

AAB NEWS : కళాకారుల సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుపోయి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు తెలిపారు. శుక్రవారం నగరంలోని గుల్జార్ పేటలో గల లిటిల్ ప్లవర్ సూల్ లో వివిధ రంగాలకు చెందిన కళాకారులకు చేయితనిస్తూ అనంత సినీ సంగీత కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు మాట్లాడుతూ…కళ అనేది దేవుడిచ్చిన వరం అని,అనంతపురం జిల్లాలో కూడా వివిధ రంగాల చెందిన ఎందరో మంది కళాకారులకు ప్రసిద్ధిగాంచారని తెలిపారు.ఇప్పటికీ ఎంతో మంది తమ కళలను ఇతరులకు పంచుతు సంతోషాన్నిస్తున్నారని పేర్కొన్నారు కరోనా మహమ్మరితో మానవ మనుగడకే కష్టం వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరాన్నారు.కరోనా మహమ్మారి వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు అందిస్తూ అండగా నిలుస్తున్నారని తెలిపారు.రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన కళాకారులను ప్రోత్సాహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులను ప్రదానం చేసినది తెలిపారు.ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికీ ఇళ్ళు పట్టాలను పంపిణీ చేశామని ఇంకా ఎవరికైనా అర్హులై ఉండి ఇంటి పట్టా రాని వారు మరోమారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.కరోనా కష్టకాలంలో కళాకారులకు చేయూత నిస్తూ నిరుపేద కళాకారులకు నిత్యావసర సరుకులను అందిస్తున్న అనంత సినీ సంగీత కల్చరల్ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించారు.కార్యక్రమంలో ప్రొఫిసర్ సుధాకర్ బాబు గారు,దినేష్ బాబు గారు,లిటిల్ ప్లవర్ స్కూల్ అధినేత ఆంజనేయులు గారు,కో-ఆప్షన్ సభ్యురాలు ఉమామహేశ్వరి గారు,ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు.

 1,923 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.