AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కానే కాదంటున్న విద్యుత్ అధికారులు…

1 min read

AAB NEWS:గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలోని ఓ రొయ్యల చెరువు వద్ద కాపలాగా ఉన్న ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులను ఒడిశాకు చెందిన కూలీలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.రాత్రివేళ విద్యుదాఘాతం కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని చెబుతుండగా, విద్యుత్ అధికారులు మాత్రం వారి మరణానికి షార్ట్‌సర్క్యూట్ ఎంతమాత్రమూ కారణం కాదని చెబుతుండడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. మరోవైపు, ఘటనా స్థలం వద్దకు మీడియాను అనుమతించడం లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 78 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.