September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులు

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

స్థానిక జి.యం.కార్యాలయంలో సింగరేణిలో
నూతనంగా చేరిన 18 మంది యువకులకు కారుణ్య నియామక ఉద్యోగ పత్రములను ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఈ.సిహెచ్ నిరీక్షణ్ రాజ్ గారి చేతులమీదఅందజేయడం
జరిగింది. అనంతరం జి యం గారు మాట్లాడుతూ – ప్రతి ఒక్క ఉద్యోగి సంస్థ ప్రగతికి అంకిత భావంతో పనిచేయాలని కోరారు. సంస్థలో చేరుతున్న యువకులు జాగ్రత్తగా క్రమశిక్షణతో పనిచేయాలని కోరారు. సంస్థలో యువశక్తి పెరుగుతుందని రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషి చేయాలని జి.యం గారు చెప్పారు. సంస్థలో చేరిన రోజే ఒక నిర్దేశితమైన లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష్య సాధనకై పట్టుదలతో కృషి చేయాలని అన్నారు. కష్టపడితేనే సుఖపడగలమని జి యం గారు అన్నారు మరియు ఉపరితల గనుల పనికోసం ఇబ్బందులు పడకుండా భూగర్భ గని పనులకు అలవాటు పడాలని
యువతను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలో ఉద్యోగం పొందడం అదృష్టంగా భావించి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని మరియు చెడు వ్యసనాలకు
దూరంగా ఉంటూ కుటుంభసభ్యులతో కలిసి సుఖ సంతోషాలతో జీవించాలని అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే విధ్యావంతులైన మీరు మీ యొక్క పనితనాన్ని కనబరుచుతూ గైర్హాజర్లకు దూరంగా వుంటూ ఎన్నో ఉన్నత పదవులకోసం శ్రమించాలని కూడా జి యం గారు కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఈ.సిహెచ్.నిరీక్షన్ రాజ్
గారు, శ్రీ ఎస్ జోతి – AGM (IED) గారు, అధికార ప్రతినిధి శ్రీ ఎస్ అనిల్ కుమార్ –
PM గారు, శ్రీ డి సంజీవ్ రావు Sr. Asst.గారు, మరియు గుర్తింపు సంఘం
నాయకులు శ్రీ కొక్కుల తిరుపతి (TBGKS) గారు, మరియు ప్రాతినిధ్య సంఘం
నాయకులు శ్రీ మోటపలుకుల రమేష్ (AITUC) గారు పాల్గొన్నారు.

 990 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.