కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు…
1 min read
AABNEWS : అమరావతివైఎస్ విజయలక్ష్మికి రెండేళ్ల తర్వాత మరిది వైఎస్ వివేకానందరెడ్డి హత్య జ్ఞాపకం రావడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్త చచ్చిన 6 నెలలకు కోడలు ఏడ్చినట్లుందన్న సామెత గుర్తుకొస్తుందన్నారు. 15-3-2019న వివేకానందరెడ్డి హత్య జరిగిందని, 31-5-2019న జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని, 11-3-2020న హైకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిందన్నారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజుకు…హైకోర్టు సీబీఐ దర్యాప్తు ఆదేశానికి మధ్య 9నెలల 10 రోజుల సమయం ఉందన్నారు. దీనికి విజయలక్ష్మి, జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ సమయంలో జగన్ ప్రభుత్వం దర్యాప్తు ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. సీబీఐ దర్యాప్తుకు ఆదేశం ఇచ్చి సంవత్సరం పూర్తయినా దర్యాప్తు కాకపోవడంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుందని తులసీరెడ్డి ప్రశ్నించారు.
1,270 Total Views, 2 Views Today