September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కుటుంబాన్ని వెంటాడుతున్న కరోనా…

1 min read

AABNEWS : కరోనా మహమ్మారి ఇప్పటికే పలువురు ప్రముఖులను వెంటాడుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కరోనా సోకిందని నిర్ధారణ అవ్వగా.. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా తనకు కరోనా సోకిందని స్పష్టం చేశారు. తనకు కరోనా పాజిటివ్ అని ఈ ఉదయం నిర్ధారణ అయిందని వరుణ్ తేజ్ తెలిపారు. తనలో కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని చెప్పాడు. ప్రస్తుతం ఇంటి వద్ద స్వీయ నిర్బంధంలో ఉన్నానని… అన్ని జాగ్రత్తలను పాటిస్తున్నానని తెలిపాడు. త్వరలోనే కరోనా నుంచి కోలుకుంటానని చెప్పాడు. మీ ప్రేమకు ధన్యవాదాలు అని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. మెగా స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ అని తనకు తెలిసిందని.. అయితే తనలో ఎలాంటి కరోనా లక్షణాలు కూడా కనిపించడం లేదని చరణ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి హోం క్వారంటైన్ లో ఉన్నానని రామ్ చరణ్ అన్నాడు. వీలైనంత తొందరగా కోలుకుని.. మునుపటికంటే బలంగా మీ ముందుకు వస్తానని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని రామ్ చరణ్ సూచించాడు. రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ అనే వార్త తెలియగానే అభిమానులు కూడా షాక్ అయ్యారు. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు. మెగా హీరోలందరూ ఇటీవల పలు ఫంక్షన్స్ లో పాల్గొన్నారు. అందులో భాగంగానే కరోనా సోకి ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో మెగా అభిమానులందరూ తెగ టెన్షన్ పడిపోతూ ఉన్నారు. మెగా కుటుంబాన్ని కూడా కరోనా భయం వెంటాడుతూ ఉంది. మెగా కుటుంబంలో ఇంకా ఎవరెవరికి కరోనా సోకిందోనని అభిమానులు భయపడుతూ ఉన్నారు. ఇటీవలే కొణిదెల నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించింది మెగా స్టార్ చిరంజీవి కుటుంబం. ఆ తర్వాత కూడా పలు ఈవెంట్లలో మెగా హీరోలు పాల్గొన్నారు. కుటుంబంలోని అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించినట్లు, నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

 172 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.