AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కేంద్ర ప్రభుత్వం కు వ్యతిరేకంగా అతిరథమహారధులు

1 min read

AAB NEWS: తెలంగాణ రాష్ట్ర బ్యూరో :బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

రైతుల పక్షాన మేము ఉంటాము : *ఎంపీ పసునూరి దయాకర్ *

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 బిల్లుల వల్ల రైతుల భవిష్యత్తు గందరగోళంలో పడనుంది. : జెడ్పి చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్ .

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రైతు చట్టాన్ని వ్యతిరేకిస్తూ రైతులకు మద్దతుగా నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ గండ్ర వెంకట రమణారెడ్డి పార్లమెంటు సభ్యులు పసునూరి దయాకర్ ,జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్ భారత్ బంద్ లో పాల్గొని రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా గౌరవ భూపాలపల్లి నియోజకవర్గ *ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి * మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పార్లమెంట్ సభ్యులు శ్రీ *పసునూరి దయాకర్ * మాట్లాడుతూ ” రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని, రైతులను మసిపూసి మారేడు కాయల చేసి ఏదో కొత్తదనం బిల్లు లో ఉన్నట్టుగా చూపిస్తున్నారని ఆరోపించారు.

అనంతరం *జయశంకర్ భూపాలపల్లి జిల్లా జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ జక్కు రాకేష్ మాట్లాడుతూ ” ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని అన్నారు, నిజంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసే ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ బిల్లుల్ని కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా రూపొందించేది కాదని వారు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులు పైకి రైతుల మంచి కోసమే అని చూపిస్తూ వాటి పర్యవసానాలు మాత్రం నూటికి నూరు శాతం రైతుల జీవితాలతో భవిష్యత్తుతో ఆడుకునే లా ఉందని తెలియజేశారు. నిజంగా రైతులకు కోసమే ఈ బిల్లును ఏర్పాటు చేస్తే కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసే కంపెనీ ఎం.ఎస్.స్వామినాథన్ చెప్పినట్టు రైతు పెట్టుబడికి యాభైశాతం అదనంగా కలిపి మొదటగా చెల్లించాలి. ఈ బిల్లులో ఆ ఊసే లేదు మరియు కాంట్రాక్ట్ ఫార్మింగ్ కేవలం సేంద్రీయ ఎరువులు లేదా జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ద్వారానే చెయ్యాలి, రసాయనాలు వాడడం బ్యాన్ చేయాలి లేదంటే కార్పొరేట్లు పిప్పి పీల్చుకొని భూమి రైతులకు దేనికీ పనికిరాదు. అంతేకాకుండా ప్రభుత్వమే రైతు ఉత్పత్తులు కొన్ని మార్కెటింగ్ చేసుకోవాలి మార్కెట్లు కమిటీలు, యార్డుల పై శ్రద్ధ పెట్టాలి.ఇంకా ఇవి కాకుండా చాలానే ఉన్నాయి, ఇలాంటి ఎన్నో బృహత్తరమైన అంశాలు బిల్లులో కనిపించడం లేదు. ఇవేమీ లేకుండా కార్పొరేటర్లకు లాభం చేకూర్చే బిల్లులు పాస్ చేయడం వల్ల రైతులు ఎంత నష్టపోతున్నారు రైతులు నష్టపోతే సామాన్యుడికి కూడా తిండి దొరకదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని, లేదంటే తెరాస ప్రభుత్వం రైతుల మద్దతుగా ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుందని యువ నాయకుడు *గౌరవ జయశంకర్ భూపాలపల్లి జిల్లా జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ జక్కు శ్రీ హర్షిని రాకేష్ గారు* తీవ్రంగా మండిపడ్డారు.
రైతులకు వ్యతిరేకంగా నూతన చట్టాలను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం వెంటనే వాటిని రద్దు చేయాలని వరంగల్ రూరల్ జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి గండ్ర జ్యోతి అన్నారు.
ఈ కార్యక్రమంలో వారితో పాటుగా భూపాలపల్లి జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్పర్సన్ శ్రీమతి కళ్ళెపు శోభా రఘుపతి రావు గారు, లైబ్రరీ చైర్మన్ రాజేష్ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, అన్ని మండలాల జడ్పీటీసీ లు,ఎంపీటీసీలు,ఎంపీపీ లు,కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు,PACS పాలక మండలి సభ్యులు, నాయకులు,కార్యకర్తలు, రైతులు మరియు మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

 76 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.