కనకరాజు బృందంతో కలిసి గుస్సాడీ నృత్యం…
1 min read
AABNEWS : కొమరం భీం: పద్మశ్రీ పురస్కారం పొందిన కనకరాజును… రాజ్భవన్లో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఘనంగా సన్మానించారు. అనంతరం తమిళి సై, మంత్రి సత్యవతి రాఠోడ్… కనకరాజు బృందంతో కలిసి గుస్సాడీ నృత్యం చేసి అరలించారు. మారుమూలన ఉన్న ఎంతో మంది కళాకారులను గుర్తించి గౌరవించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన గుస్సాడి నాట్యకారుడు కనకరాజుకు… గిరిజన సంక్షేంశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఆధ్వర్యంలో రాజ్భవన్లో ఘనంగా సన్మానించారు. రాజ్భవన్లో కళావేదికపై కనకరాజు బృందం చేసిన గుస్సాడి నృత్యాన్ని ఆసాంతం వీక్షించారు. తమిళి సై, సత్యవతి రాఠోడ్… కనకరాజు బృందంతో కలిసి గుస్సాడి నృత్యం చేసి అలరించారు. అనంతరం ఒక్కొక్క కళాకారుడిని ప్రత్యేకంగా అభినందించారు. బోయినపల్లి మార్కెట్లో కూరగాయల వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తిని ఇటీవల మన్ కీ బాత్లో ప్రధాని ప్రస్థావించడన్ని గవర్నర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా కనకరాజు గవర్నర్ తమిళి సైని తమ గ్రామానికి రావాల్సిందిగా ఆహ్వానించారు
130 Total Views, 2 Views Today