పావన మడుగు వద్ద ఎమ్మెల్యే సక్కు పూజలు…
1 min read
AABNEWS : కొమురం భీం:
తిర్యాణి మండలంలోని గడలపల్లి గ్రామ పంచాయతీలోని పావన మడుగు గంగా పుణ్యక్షేత్రంలో గురువారం శ్రీ జంగో లింగో మాల దారులు నిర్వహించిన పూజ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాములతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. అనంతరం స్థానిక సర్పంచ్ మాడావి గుణవంత్ రావు మాట్లాడుతూ పావన మడుగు స్థలాన్ని అభివృద్ధి చేయాలని, అలాగే అసిఫాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి చాలా సులువుగా ఉన్న గడలపల్లి నుండి ఓపెన్ కాస్ట్ మీదుగా వెళ్లే దారిని బీటీ రోడ్డు వేసి వాగులో బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరగా ఆ అభివృద్ధి పనులకు కృషి చేస్తామని ఎమ్మెల్యే సక్కు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిర్యాణి ఎస్సై రామారావు, ఉప సర్పంచ్ సోయం కట్టి,సర్పంచ్ లు బాదిరావు, మాడావి శ్రీరాములు, సిడం సత్పాత్ రావు, పలు గ్రామాల జంగో లింగో స్వాములు పాల్గొన్నారు.
87 Total Views, 2 Views Today