September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాల్లో అభ్యున్నతికి కృషి చేసిన ఘనత ఎంఐఎందే..!

1 min read

AABNEWS : ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాల్లో అభ్యున్నతికి కృషి చేసిన ఘనత ఎంఐఎందే..!యువత ఉన్నత లక్ష్యాలను అధిరోహించి.. తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలి ఎంఐఎం కరీంనగర్ జిల్లా ఇంచార్జి సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ పిలుపు కాగజ్ నగర్లో ఎంఐఎం ఆధ్వర్యంలో టెట్/టీఆర్టీ ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభం ముస్లిం యువత విద్య, ఉద్యోగ రంగాల్లో రాణించాలని, కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి శ్రమించి ఉద్యోగ సాధించాలని ఎంఐఎం కరీంనగర్ జిల్లా ఇంచార్జి సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ పిలుపునిచ్చారు. ఆదివారం ఎంఐఎం అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ సూచనల మేరకు ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలో సంతోష్ ఫంక్షన్ హల్లో టీఆర్టీ/టెట్ ఉచిత కోచింగ్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ యువత జీవితంలో ఉద్యోగాలు సాధించి, స్థిరపడాలని, ఉన్నత లక్ష్యాలను అధిరోహించి తల్లిదండ్రులు కలలను సాకారం చేయాలని కోరారు. ముస్లిం యువతకు ఎంఐఎం పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. ముస్లింలకు అండగా ఉండి విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అభ్యున్నతి కోసం ముందుండి నడిపేందుకు ఎంఐఎం పార్టీ గత 60 ఏండ్లుగా విశేషంగా కృషి చేస్తుందన్నారు. దేశంలో మైనార్టీల కోసం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేసింది ఎంఐఎం పార్టీ అని పేర్కొన్నారు. సాలరే మిల్లత్ ఆల్ఇన్వన్ గైడ్అందించి ఎందరో పేద విద్యార్థులకు ఎంఐఎం అండగా నిలిచిందన్నారు. నేటి మైనార్టీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఎంఐఎం కృషితో ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిన ఘనత ఎంఐఎంకే దక్కుతుందన్నారు. యువత టీచర్ జాబ్ లతో పాటు పోలీస్ శాఖలో 20 వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రాబోవుతుందనీ అందు కోసం సన్నద్ధం కావాలని కోరారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి టెట్/టీఆర్టీ ఉచిత కోచింగ్ సెంటర్ను ముస్లిం యువత కోసం ఏర్పాటు చేసిన ఎంఐఎం కాగజ్ నగర్ అధ్యక్షుడు అబ్దుల్ ముబిన్ ను, సహకరించిన దాతలకు, పార్టీ కార్యకర్తలను, నేతలను అభినందించారు. ముస్లిం యువత ఈ ఉచిత ట్రైనింగ్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో ఎంఐఎం ప్రధాన కార్యదర్శి జావిద్ మల్నాస్, జాయింట్ సెక్రటరీ ఆబిద్ ఖాద్రీ, ఎక్స్పర్ట్ ట్రైనర్ షాహిద్ అలీ హస్రత్, జమతే ఇస్లామీ హింద్ అధ్యక్షుడు ఎంఎ బషీర్, నాయకులు మహమ్మద్ అప్జల్, అస్గర్, నయీమ్, అమర్ సయీద్, నియజుద్దీన్, 150 మంది ట్రైనింగ్ తీసుకునే యువత పాల్గొన్నారు.

 252 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.