AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాక్రమO…

1 min read

AAB NEWS : కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాక్రమములో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న తెలుగుదేశంపార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి.
జగన్ ప్రభుత్వంలో పబ్లిసిటీ పీక్ – విద్యార్థుల సంక్షేమం వీక్చంద్రబాబు గారి హయాంలో విద్యారంగం పై ఏడాదికి రూ.19 వేలు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదికి రూ.13 వేలు కోట్లు మాత్రమే ఖర్చు చేసి గొప్పలు చెప్పుకుంటున్నారునాణ్యమైన విద్య కు సంబంధించి నీతి అయోగ్ ప్రకటించిన ర్యాంకుల మేరకు నాడు (తెదేపా ప్రభుత్వం లో) 3 వ స్థానం , నేడు (వైసీపీ వైసీపీ ప్రభుత్వం లో) 19 వ స్థానం.నాడు చంద్రన్న ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లిస్తే, నేడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 10.97 లక్షల మంది విద్యార్థులకే పథకాన్ని పరిమితం చేసిందికోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూనిన్న ముఖ్యమంత్రి గారు విద్యా దీవిన పథకం ప్రారంభం సందర్భంగా విద్యా రంగం పై గత రెండు సంవత్సరాలు కాలంలో విద్యారంగం పై రూ 26,667 కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెప్పుకున్నారు.గతములో తెలుగుదేశం హయాంలో విద్యారంగం పై ఏడాదికి రూ.19 వేల కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వంలో నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన లెక్కల ప్రకారం ఏడాదికి రూ 13 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దీనిని బట్టి వైసీపీ ప్రభుత్వం లో పబ్లిసిటీ పీక్,పనితనం వీక్ అని తేలిపోయింది.నాణ్యమైన విద్యలో నీతిఅయోగ్ ఇచ్చిన ర్యాంకులలో మన రాష్ట్రం గత చంద్రబాబు గారి హయాంలో 3 వ స్థానం లో ఉండగా నేడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 19 వ స్థానంలో ఉంది.దీనిని బట్టి రాష్ట్రంలో విద్యారంగం ఏవిధంగా ఉందొ అర్ధమవుతుంది.నాడు చంద్రన్న ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లిస్తే, నేడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 10.97 లక్షల మంది విద్యార్థులకే పథకాన్ని పరిమితం చేసింది.దాదాపు 5 లక్షల మంది పైగా విద్యార్థులు ఫీజు రీయంబర్స్మెంట్ అందక రోడ్డున పడితే పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రచార ఆర్భాటాల కోసం 5 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసింది.ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కళాశాలల పీజీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ ను రద్దు చేస్తూ,విద్యా దీవెన పథకాన్ని వారికి నిలిపివేస్తూ వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 77 విడుదల చేసింది. ఉన్నత విద్య కు తమను దూరం చేయొద్దని విద్యార్థులు చేసిన ఆర్తనాదాలు, ఆందోళనలను వైసీపీ ప్రభుత్వం పెడ చెవిన పెట్టింది.పీజీ చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు కళాశాల ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు అదనంగా వసతి, భోజనం కోసం ఏటా 20 వేల రూపాయలను ప్రతీ విద్యార్థికి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక చేతులు దులుపుకున్నారు.నెల్లూరు జిల్లా పాదయాత్ర సమయంలో ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన బీటెక్ చదివే విద్యార్థి ఫీజు రీయింబర్స్మెంట్ అందక ఆత్మహత్య చేసుకున్న ఘటన తనను కలచివేసిందని,నెల్లూరు లో పాదయాత్ర అనగానే నాకు మొదట గుర్తుకు వచ్చేది ఇదేనని , తాను ముఖ్యమంత్రి అయితే ఇలాంటి పరిస్థితి రానివ్వనని నెల్లూరు SVGS గ్రౌండ్ బహిరంగ సభ లో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాక, కళాశాల యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక, తల్లిదండ్రులను నొప్పించలేక ఒంగోలుకు చెందిన తేజస్విని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకున్న పాపాన పోలేదు.ఇంట్లో ఎంత మంది ఉంటే, ఎంతమందికి అమ్మ ఒడి ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికే అంటూ మొండి చేయి చూపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది.పేద విద్యార్థులలో హాజరు శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో తెదేపా ప్రభుత్వ హయాంలో చేసిన “ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని” వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా 447 ప్రభుత్వ కళాశాలల్లోని 9 వేలకు పైగా పేద విద్యార్థుల నోరు కొట్టింది.తెదేపా ప్రభుత్వ హయాంలో బాలికల విద్యను ప్రోత్సహిస్తూ , వారి హాజరు శాతాన్ని పెంచే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 8,9 తరగతులు చదివే బాలికలకు 3 లక్షల 81 వేల 142 సైకిళ్లను మంజూరు చేస్తే , అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం కక్ష సాధింపుతో సైకిళ్లను మూలన పడేసింది.రాష్ట్రంలో విద్యా వ్యవస్థను అన్ని విధాలుగా పూర్తిగా నిర్వీర్యం చేసి, నేడు విద్యా దీవెన పేరిట ఆర్భాటపు ప్రచారాలు చేస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రుల ను మభ్యపెట్టేందుకు వైసిపి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఈసమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నదుల రవికుమార్, పాశం పరందామయ్య,SK నాసీర్,మారుబోయిన వెంకటేశ్వర్లు, సజ్జా అశోక్,కె.గోపాల్,మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు

 97 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.