AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

క్రీడలతో పాటు చదువులో రాణించాలి…

1 min read

AABNEWS : క్రీడలతో పాటు చదువులో రాణించాలి వాడో ని లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన జడ్పీ చెర్మెన్ జనార్దన్రాథోడ్ ఉట్నూర్ మండలం వడోని గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నేటి నుండి ప్రారంభం అయ్యింది,15 రోజులవరకు సాగే క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి జడ్పీ చెర్మెన్ గారు పాల్గొని టోర్నమెంట్ ను ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జడ్పీ చెర్మెన్ గారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థులకు చాలా అవసరం, ఆట పాటల్లో కూడా విద్యార్థులు రాణించాలని, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు, రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లాంటి అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నారు,త్వరలో 50 వేల పోస్టులు భర్తీ చేయనున్నారు, పోటీ పరీక్షల్లో అందరూ బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించాలని వారన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మనోజ్, ఉపసర్పంచ్ సాగర్ , మాజీ ఎంపీటీసీ కందుకూరి రమేష్, జీవ వైవిధ్య కమిటీ సభ్యులు మరసుకొల తిరుపతి,అంబెడ్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి దావుల రమేష్, క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైసర్ తదితరులు పాల్గొన్నారు.

 157 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.