చెట్టును ఢీకొన్న బైక్ యువకులు మృతి…
1 min read
AABNEWS : కామేపల్లి మండలం బుగ్గవాగు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన కామేపల్లిలో చోటు చేసుకుంది. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతుల వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతుల వివరాలు వెల్లడించారు. మృతులు పండితాపురం గ్రామానికి చెందిన అరిపిన్ని వెంకటేష్(23), కానుగుల సాయి(22)గా గుర్తింపు పోలీసులు గుర్తించారు.
82 Total Views, 4 Views Today