AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పట్టభద్రుల సమస్యలను పరిష్కరించే గొంతునవుతా

1 min read

AABNEWS : రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు అందరూనల్లగొండ, ఖమ్మం ,వరంగల్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ఓటేసి గెలిపించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ పైఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తో కలిసి మార్నింగ్ వాకర్స్ ను కలిసి ప్రచారం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ,నిరుద్యోగుల ,ఉద్యోగుల సమస్యలను నిరంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందువరుసలో ఉంటారని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కేవలం కెసిఆర్ కె సాధ్యమవుతుందని చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రులు రానున్న ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపిస్తే ప్రశ్నించే గొంతు గానే కాకుండా సమస్యను పరిష్కరించే గొంతు నవుతానని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం ఒక లక్ష 31 వేల ఉద్యోగాలు పూర్తి చేసిందని చెప్పారు . మరో 50 వేల ఉద్యోగాలను గుర్తించి నోటిఫికేషన్ వేసేందుకు సిద్ధం చేస్తుందన్నారు,. ఐటీ ఫార్మా రంగంలో 14,800 కంపెనీలు వస్తున్నాయని వీటిలో 16 లక్షల ఉద్యోగాలు త్వరలోనే భర్తీ కానున్నాయి అని చెప్పారు. సీమాంధ్ర పాలనలో ఏడు శాతం ఉన్న నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్రంలో 4 శాతానికి తగ్గిందని స్వయంగా కేంద్ర ప్రభుత్వం చేయించిన సర్వే చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేసింది అన్న విషయం అర్థం చేసుకోవాలన్నారు.ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జెడ్ పి టి సి జి డి బిక్షం, టిఆర్ఎస్ జిల్లా నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రాజా ,గండూరి ప్రకాష్ , వై వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ సంఘం నాయకులు మట్టపల్లి రాధాకృష్ణ ,రాచూరి ప్రతాప్ తదితరులు ఉన్నారు. పంతంగిని కలిసిన పల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తో కలిసి శుక్రవారం జిల్లా కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్నింగ్ వాకర్స్ ను కలిసిన సందర్భంలో నే అక్కడే ఉన్న జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ ను కలిశారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎంతోమంది పట్టభద్రులు ఉన్నారని తప్పకుండా వారందరి చేత తనకు ఓటు వేయించాలని కోరారు.

 326 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.