AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గంగను దివి నుండి భువికి తెచ్చిన భగీరథ మహర్షి చరిత్ర చాలా గొప్పది

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భగీరధుని జయంతి ఉత్సవాలలో జిల్లా కలెక్టర్ పాల్గొని భగీరథుని చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి కోవిడ్ నిబంధనను అనుసరించి నిర్వహించారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ వైశాఖ శుద్ధ సప్తమి రోజున భగీరథుని జయంతి ఉత్సవాల నిర్వహణలో భాగంగా బుధవారం ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని, భగీరథుడు తన తాత, ముత్తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగ కోసం తపస్సు చెేసి గంగ అనుగ్రహం పొంది నేలపైకి గంగను తీసుకువచ్చి తన తాత, ముత్తాతలకు ఉత్తమగతులు కలగ చేసిందని చరిత్ర చెబుతుందని,ఇప్పటికి సాగునీటి ప్రాజెక్టులను కట్టి ప్రజలకు సాగు,త్రాగు నీటిని అందించే వారిని భగీరథునితో పోలుస్తారని కలెక్టర్ అన్నారు .
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ టి. శైలజ, బీసీ వెల్ఫేర్ కార్యాలయ సిబ్బంది ,కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

 1,240 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.