AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గట్టు ఎత్తిపోతల పథకానికి మోక్షం ఎప్పుడు…

1 min read

AABNEWS : రంజిత్ కుమార్ నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్
జోగులాంబ గద్వాల:నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో రంజిత్ కుమార్ మాట్లాడుతూ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2018 న గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు అంచనాల దశ కూడా దాటడం లేదని, ప్రతిపాదనలు అంచనాల పేరుతో కాలయాపన చేస్తూ గట్టు మరియు కేటి దొడ్డి మండలం రైతుల ఆశలపై నీళ్లు జల్లుతున్నారని అన్నారు. పరిపాలన అనుమతుల కోసం పంపిన నివేదిక అంచనా వ్యయం భారీగా ఉందనే నెపంతో వెనక్కి పంపి తిరిగి మరో మూడు ప్రతిపాదనలు పంపాలని కోరడం చూస్తుంటే నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి గట్టు ఎత్తిపోతల పథకం పై చిత్తశుద్ధి ఉందా? అని ప్రశ్నించారు.
సిరిసిల్ల, సిద్ధిపేట కు సంబంధించిన ఏ ప్రాజెక్టు అయినా చకచకా జరిగిపోతాయి గాని దక్షిణ తెలంగాణ పై ముఖ్యంగా నడిగడ్డ పై మాత్రం ఈ వివక్ష ఎందుకని, కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి 60 కిలోమీటర్ల దూరం వరకు నీళ్లు తీసుకెళ్తారు గాని నెట్టెంపాడు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం వరకు కూడా నీళ్లు ఎందుకు తీసుకెళ్ల లేకపోతున్నారు. ఇప్పటి వరకు తుమ్మిళ్ల ప్రాజెక్టు స్టేజ్-2 పనులు పూర్తి కాని పరిస్థితి ఎందుకుందో పాలకులకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.
స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వచ్చి ఈ పథకానికి శంకుస్థాపన చేసినా ఇప్పటివరకు అనుమతుల పేరుతో ,ప్రతిపాదనల పేరుతో కాలయాపన చేస్తున్నారని, అత్యంత వెనుకబాటుతనానికి గురైనటువంటి గట్టు మరియు కే.టి దొడ్డి మండలాల రైతులు ల ఆశలను అడియాశలు చేస్తున్నారని అన్నారు. సర్వేల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తూ ప్రజలను తాత్కాలిక ఆనందాలకు గురిచేస్తూ, కేవలం ఓట్లు దండుకోవడానికి మాత్రం ఈ పథకాన్ని వాడుకుంటున్నారని నిజంగా ఈ ఎత్తిపోతల పథకంపై పాలకులకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
మొదట 0.57 టీఎంసీల సామర్థ్యంతో అనుకొని తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు జూరాల నుంచి ఎత్తిపోతల ద్వారా 10 టీఎంసీల నీటిని నిల్వ చేసి, అక్కడి నుండి గట్టు జలాశయానికి నీటిని అందించేలా ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర రిటైర్డ్ ఇంజనీర్ల బృందం పర్యటించింది. మళ్లీ ఈ ప్రతిపాదనను విరమించుకుని నెట్టెంపాడు రెండో స్టేజ్ లో ఉన్న ర్యాలంపాడు జలాశయం నుంచి గట్టు ఎత్తిపోతల చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో ప్రస్తుతం మూడు టీఎంసీల సామర్థ్యంతో, 1,350 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిపాదనలు పంపగా వ్యయం తగ్గించాలని అని మరోసారి అంచనాలను 1.50 టీఎంసీ, 2.00 టీఎంసీ, 3.00 టీఎంసీలు గా మూడు రకాల ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఈ రకంగా అంచనాల మరియు పరిపాలన అనుమతులు దశలోనే ఎత్తిపోతల పథకం నలిగి పోతుందని ఇకనైన పరిపాలన అనుమతులు ఇచ్చి, టెండర్లు పిలిచి పనులకు పునాదులు పడేలా ప్రయత్నం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, వెంకట్ రాములు,నరసింహ తదితరులు పాల్గొన్నారు.

 100 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.