AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గుడ్‌న్యూస్‌ చెప్పిన జియో.. మళ్లీ అన్నీ ఫ్రీ..!

1 min read

AABNEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

అన్నీ ఫ్రీ అంటూ టెలికం రంగంలో అడుగుపెట్టి సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. 2021 న్యూ ఇయర్ రాబోతున్న తరుణంతో తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది… 2021 జనవరి 1 నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు కూడా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని ప్రకటించింది జియో.. మొదట డేటా, కాల్స్ ఫ్రీ అంటూ కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించిన జియో.. ఆ తర్వాత టారిఫ్‌ అమలు చేసినా.. డేటాకు మాత్రమే ఛార్జీ విధించి ఏ నెట్‌వర్క్‌కైనా వాయిస్ కాల్స్ ఫ్రీగా అందించింది.. ఇక, ఆ తర్వాత.. జియో టూ జియో కాల్స్‌ మాత్రమే ఫ్రీ అని.. ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ చేసుకోవాలంటే నిమిషానికి 6 పైసలు చెల్లించాలనే నిబంధనలు విధించి వసూలు చేస్తూ వస్తోంది.. ఈ కాల్స్ కోసం రూ.10 నుంచి టాపప్ ఓచర్లను అందుబాటులోకి తెచ్చింది.. ఇక, న్యూఇయర్‌ సందర్భంగా తన యూజరట్లకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తూ.. దేశీయంగా ఏ నెట్‌వర్క్‌కు కాల్ చేసినా.. ఇక ఫ్రీ అని ప్రకటించింది. 
ట్రాయ్ ఆదేశాల మేరకు ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జ్‌లకు(ఐయూసీ) 1 జనవరి 2021 నుంచి స్వస్తి పలకనుండటంతో.. మళ్లీ తమ నెట్‌వర్క్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకూ ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చని జియో స్పష్టం చేసింది.. జియో నెట్‌వర్క్‌లో ఆన్-నెట్ డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఎల్లప్పుడూ ఉచితం అని కంపెనీ ప్రకటించింది.. జియో నుండి దేశంలోని ఎక్కడైనా, ఏ నెట్‌వర్క్‌కైనా ఆఫ్-నెట్ డొమెస్టిక్ వాయిస్ కాల్స్ 2021 జనవరి 1 నుండి ఉచితం తెలిపింది.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా సాధారణ భారతీయుడిని కూడా లబ్ధిదారునిగా మార్చాలనే నిబద్ధతపై జియో నిలుస్తుంది అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, జియో ఈ ప్రకటన చేసిన తర్వాత బీఎస్‌ఈలో భారతి ఎయిర్‌టెల్ షేర్లు దాదాపు 2 శాతం పడిపోయాయి. కాగా, గత కొంతకాలంగా జియో యూజర్ల తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే.. రైతుల ఉద్యమం ఎఫెక్ట్‌ కూడా జియోపై పడింది.. జియోను బహిష్కరించాలనే ఉద్యమం కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది.

 87 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.