AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గౌరవ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు గారి చేతుల మీదుగా పెదపెంకి గ్రామంలో దోమ తెరలు పంపిణీ…

1 min read

AABNEWS : గౌరవ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు గారి చేతుల మీదుగా పెదపెంకి గ్రామంలో దోమ తెరలు పంపిణీ బలిజిపేట మండలం, పెదపెంకి గ్రామం పంచాయతీలో వైద్య ఆరోగ్య శాఖ, విజయనగరం జిల్లా వారు సమకూర్చిన దోమ తెరలును ఈరోజు మధ్యాహ్నం గౌరవ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు గారి చేతుల మీదుగా బలిజిపేట ప్రాథమిక ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ మహిపాల్ గారి సమక్షంలో గ్రామ ప్రజలకు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగారావు గారు మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం సమకూర్చిన దోమ తెలలను ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందని కావున ప్రజలందరూ ఈ దోమ తెరలును సద్వినియోగం చేసుకుని రోగాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌ, ఎమ్మెల్యే గారికి వైద్యాధికారులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు పెదపెంకి గ్రామ సర్పంచ్ ఎన్ పాపారావు, ఉప సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థులు జీ శ్రీనివాసరావు, జీ జగన్, జెడ్పీటీసీ అభ్యర్ధి ఏ రవికుమార్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 2,727 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.