ఘనంగా మోహినికుంట మల్లన్న కళ్యాణం :
1 min read
AABNEWS: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి పూడూరి జీవన్ రెడ్డి :
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో ప్రఖ్యాత శ్రీ కేతమ్మ మేడలమ్మ సమేత మల్లికార్జున స్వామి వారి కల్యాణ మహోత్సవం ఆదివారం రోజున అర్చకులు వేద మంత్రోచ్ఛనాలతో నిర్వహించారు.స్వామివారికి నర్సింగాపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం పట్టు కళ్యాణవస్త్రాలు పూజారుల ద్వారా సమర్పించారు.ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణం తిలకించారు.కాగా మల్లికార్జున స్వామివారి కళ్యాణం ప్రతి యేటా ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ.భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా నర్సింగాపూర్ మోహినికుంట మల్లన్న ను పిలుచుకుంటారు.ఈ దేవాలయం పురాతనకాలం నుండే ఉండేదని గ్రామస్తులు తెలిపారు. స్వామివారిని ఇక్కడి వారే కాకుండా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి బోనాలు సమర్పించి స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. కోరిన కోరికలు తీర్చే మల్లికార్జున స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.స్వామివారిని దర్శనం చేసుకున్న వారిలో సర్పంచ్ రాపెల్లి గంగాధర్, ఉప సర్పంచ్ కాసరపు శ్రీనివాస్, వార్డ్ సభ్యులు పూడూరి జీవన్ రెడ్డి, ఆలయ కమిటీ తో పాటు వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్,వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, రుద్రంగి మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రావు, PACS చైర్మన్ శ్రీనివాస్, డైరెక్టర్ చింతపంటి రామస్వామి,సెస్ డైరెక్టర్ రమేష్, కో ఆప్షన్ మెంబర్ కమలాకర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు..
575 Total Views, 2 Views Today