చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవకార్యక్రమాలు…
1 min read
AABNEWS : MA SHUKU TS In Charge
పెద్దపల్లి డివిజన్ పరిధిలో శ్రీ ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవకార్యక్రమాలు… కాల్వశ్రీరాంపూర్ మండలం మాల్యాల గ్రామంలో అరెల్లి కిట్టయ్య గౌడ్ గత కొన్ని నెలల క్రితం కుల వృత్తిలో బాగంగా తాటి చెట్టు ఎక్కి కల్లు గిస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారీ క్రింద పడడంతో చనిపోవడం జరిగింది .ఈరోజు ట్రస్టు అధ్యక్షుడు సదయ్య గౌడ్ వారి ఇంటికీ వెళ్లి వారి కుటుంబసభ్యులను పరమార్చించి 25kg ల బియ్యం మరియూ నెలకు సరిపడ నిత్యవసర సరుకులు అందివడం జరిగింది. అధ్యక్షుడు సదయ్య గౌడ్ మాట్లాడుతూ 2004 వ సంవత్సరంలో మా అన్న కుమార్ గౌడ్ గారు చనిపోయినారు .2005వ సంవత్సరంలో ట్రస్టు స్థాపించి పెద్దపల్లి డివిజన్ పరిధిలోని నిరుపేద కుటుంబాలకు పలు సేవకార్యక్రమాలు చేస్తున్నాను అన్నారు. అలాగే మా ట్రస్టు ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని రక్తంఅవసరమైన వారు ట్రస్టును సంప్రదింసాలని తెలియజేసారు. ఇట్టి కార్యక్రమంలో బైరి కుమార్, పంజాల శంకరయ్య గౌడ్ ,జాగిరి అంజి గౌడ్ ,ఉల్లి సురెష్ గౌడ్ ,వడ్లకొండ పోశాలు గౌడ్ ,పంజాల సురేష్ గౌడ్ ,చింతల గోపీ, కామిడి నారాయణ గౌడ్,జిల్లాల శ్రీకాంత్ ,వడ్లకొండ అగయ్య గౌడ్, అరెల్లి శ్రీనివాస్ గౌడ్ ,వడ్లకొండ సత్తయ్య గౌడ్,వడ్లకొండ రాములు గౌడ్, గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు
40 Total Views, 2 Views Today