చినిగి పోయిన రూ.2 వేలు, రూ.500 నోట్లు ఎలా మార్చుకోవాలి? వీటికి ఎంత డబ్బు ఇస్తారు?
1 min read
మీరు బ్యాంకుకు వెళ్లి చినిగిపోయిన కరెన్సీ నోట్లను మార్చుకోవచ్చు. అయితే చినిగిపోయిన నోటులో ఎంత భాగం మిగిలి ఉందనే అంశంపై ఆధారపడి మీకు వచ్చే డబ్బులు ఆధారపడి ఉంటాయి. చిరిగిన రూ.2,000 నోటు పూర్తి వాపసు కోసం నోటు అసలు పరిమాణంలో కనీసం 88 శాతం అవిభక్త ప్రాంతం కలిగి ఉండాలి. సగం విలువను తిరిగి పొందడానికి 44 శాతం మిగిలి ఉండాలి.
రూ.500 నోట్లకు కూడా దాదాపుగా ఇదే రూల్ వర్తిస్తుంది. అదే రూ.200 నోటు విషయానికి వస్తే మాత్రం.. చినిగిపోయిన ముక్కల్లో ఒక పెద్ద ముక్క అయినా 78 శాతం ఉంటే పరిమాణంలో ఉంటే పూర్తి డబ్బుల వాపసు వస్తాయి. 39 శాతం ఉంటే సగం డబ్బులు వాపసు ఇస్తారు. ఇకపోతే బ్యాంకులు ఎలాంటి చార్జీలు వసూలు చేయవు.
26 Total Views, 2 Views Today