AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

చిల్లకూరు మండలం అoకులపాటూరు రెవెన్యూ లోని సర్వే…

1 min read

AAB NEWS : చిల్లకూరు మండలం అoకులపాటూరు రెవెన్యూ లోని సర్వే. నం.1002-1లో య.1.19 సెంట్ల భూమిని కలవ కొండ గ్రామ మాల కులానికి చెందిన ముడి. వెంకటయ్య కు రాష్ట్ర ప్రభుత్వం 1969 వ సంవత్సరంలో పట్టా ఇచ్చారు. అప్పటి నుండి వర్షాధార పంటలు పండించుకొని జీవించేవారు. మధ్యకాలంలో 9 సంవత్సరాలు వర్షాలు రాక కరువు రావడంతో పంట వేసుకోలేక పోయాము. దువ్వూరు. మధుసూదన్ రెడ్డి చిల్లకూరు మండల పరిషత్ అధ్యక్షులుగా రావడంతో అoకులపాటూరు రెవెన్యూలోని మాభూమిని కలవకొండ గ్రామానికి చెందిన బీసీ గొల్ల కులానికి చెందిన దొంతి. వెంకటేశ్వర్లు భార్య దొంతి. సుబ్బమ్మ పేరును రికార్థులలో నమోదు చేయిoచారు.అప్పటి నుండి అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగక పోవడం ఉమ్మడి హైకోర్టు లో ఇంటిరియం ఆదేశాలు ఉన్నాయి. ఏ.పి. లోకయుక్త సంస్థ లో విచారణలో ఉంది. గూడూరు సబ్ -కలెక్టర్ రెవిన్యూ కోర్టులో విచారణలో ఉంది. రెవెన్యూ రికార్డులలో వారి పేర్లను తొలిగించక పోవడంతో వారే సాగులో ఉన్నారు. భూసమస్య పరిష్కారం జరిగే వరకు ఇరు వురిని సాగులోకి పోకుండా నిలుపుదలచేయాలని, మాలాల భూములు అక్రమంగా ఆక్రమించి రొయ్యల సాగు చేస్తున్న వారిపై sc/అట్రాసిటీ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చెయ్యాలని ముడి. వెంకటేశ్వర్లు తహసీల్దార్ చిల్లకూరు వారిని విన్నవించారు.

 218 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.