AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జగ్గయ్యపేటప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతికి పాల్పడితే సహించేది లేదు…

1 min read

AABNEWS : జగ్గయ్యపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది అవినీతికి పాల్పడితే ఎంతటివారైనా సహించేది లేదని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను హెచ్చరించారు. శుక్రవారం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ ( బ్లడ్ బ్యాంక్ ) లో విధులు నిర్వహిస్తున్న ప్రేమ్ కిషోర్ కరోనా ర్యాపిడ్ టెస్టు కిట్లను అక్రమంగా ప్రభుత్వ ఆసుపత్రి నుండి బయటకు తీసుకుని వెళ్లి ఏపీ డయాగ్నస్టిక్ సెంటర్ ను ఏర్పాటు చేసుకుని కరోనా టెస్టుల కోసం వచ్చే ప్రజల వద్ద నుండి రూ. 1500/- నుండి రూ. 2000/- రూపాయలను వసూలు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. గురువారం ఏపీ డయాగ్నస్టిక్ సెంటర్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా 25 ర్యాపిడ్ టెస్ట్ కిట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు చేస్తున్న కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు మరియు ఏపీ డయాగ్నస్టిక్ సెంటర్ లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఒకటే అని తేలడంతో ప్రేమ్ కిషోర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన కోసం వైద్యాధికారులు, కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు వెంకటేశ్వరరావు, ఇందిరా, శారదా, ప్రవీణ్ , ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కఠారి హరిబాబు, పఠాన్ అక్బర్ ఖాన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 303 Total Views,  6 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.