AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తల్లి గొంతుపై కాలు…

1 min read

AABNEWS : డబ్బులు,బంగారం ఇవ్వాలంటూ కన్నతల్లినీ చితకబాదుతూ గొంతుపై కాలుతో నులిమి చంపేందుకు ప్రయత్నించాడు ఓ దుర్మాగుడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. బొట్ల సమ్మక్కకు ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు బొట్ల స్వామి వరంగల్ లో కూలి పనులు చేసుకుంటూ ఉండగా తల్లి మండల కేంద్రంలో ఓ రైస్ మిల్ లో కూలిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న క్రమంలో తరచూ స్వామి తల్లి దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వాలంటూ అనేకమార్లు కొట్టిన ఘటనలు ఉండగా ఈ రోజు తెల్లవారుజామున బంగారం 12 వేల నగదు లాక్కొని కొడుతూ బయటికి లాక్కొచ్చి గొంతుపై కాలుతో తొక్కుతూ చంపే ప్రయత్నం చేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడు పారిపోయాడు. సమ్మక్క పరిస్థితి విషమించడంతో ములుగు ఆస్పత్రికి తరలించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 40 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.