September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి న TS UtF జిల్లా కార్యదర్శి…

1 min read

AABNEWS : రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి న TS UtF జిల్లా కార్యదర్శి చేనగరపు రమేష్ గారు
భూపాల్ పల్లి: భారత విద్యార్థి సమైక్య SFI జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష లు TS UTF జిల్లా కార్యదర్శి చేనుగారపు రమేష్ గారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి భౌతికంగా విద్యాసంవత్సరం ప్రారంభించి న ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు పీజులు దోచుకోవడం కోసమే అనే విధంగా ఉంది అన్నారు అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలలో కొవిడ్ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అదేవిధంగా భౌతిక దూరం పాటించకుండా ఇరుకు గదుల్లో ఎక్కువ మంది విద్యార్థుల నుంచి విద్యా బోధన నడుపుతున్నారని అదేవిధంగా మూడు నెలల క్లాసుల పేరుతోటి సంవత్సరం పాటు ఫీజులు మోసం చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు అదేవిధంగా అందులో పనిచేసే ఉపాధ్యాయులకు ఇచ్చే జీతం సగం యాజమాన్యాలు మాత్రం విద్యా సంవత్సరం మొత్తం వసూలు చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు అదేవిధంగా నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన 6 7 8 తరగతుల విద్యార్థుల ను ఫీజు కడితేనే క్లాస్ రూమ్ లోకి రావాలి అనే నిబంధనలు అమలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థుల ఆన్లైన్ క్లాసులు పేరుతో ఇంటి దగ్గర ఉంటే ఇల్లిల్లు తిరిగి ఫీజులు వసూలు చేసుకుంటున్నారని వారన్నారు తదనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దమేర కిరణ్,నాగుల అరవింద్మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఒకరోజు నిరసన దీక్ష ప్రారంభించడం జరిగిందని అన్నారు ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కుమ్మక్కు అయిందని వారు అన్నారు పాఠశాలలో భౌతికంగా ప్రారంభమైన తర్వాత ఒక్క అధికారి కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో విజిటింగ్ నిర్వహించకుండా కొవెడ్ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా స్కూలు నడుపుతుంటే పట్టించుకునే నాధుడే లేరని వారు వాపోయారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదో ప్రారంభించానంటే ప్రారంభించామని చెప్పుకోవడం కోసం తప్ప ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల తల్లిదండ్రులు రక్తం తాగే విధానాన్ని అరికట్టడంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ ఫీజుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో: జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ జిల్లా నాయకులు రాజు యాకూబ్ దేవేందర్రెడ్డి రాకేష్ నితిన్ ఆదినారాయణ సాయి కళ్యాణ్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమానికి మద్దతుగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చక్రపాణి రాజన్న గొర్రెల మేకల సంఘం జిల్లా కార్యదర్శి మల్లన్న AIFB, జిల్లా నాయకులు రజినీకాంత్ గౌడ్, జన విజ్ఞాన వేదిక జిల్లా జిల్లా నాయకులు సేవా నాయక్ గారు సమతా సైనిక్ దళ్ జిల్లా నాయకులు భార్గవ్ గారు మద్దతు తెలియజేశారు

 965 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.