AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జూరాల పరీవాహకంలో అప్రమత్తం…

1 min read

AABNEWS : మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్ణాటక ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది.. మంళవారం దిగువకు నీటి విడుదల మొదలైంది.. దీంతో జూరాలకు ఏ క్షణాన్నైనా వరద పెరిగే అవకాశం ఉంది… కర్ణాటక జలనిగమ మండలి అధికారులు ఇచ్చిన సమాచారంతో జూరాల అధికారులు నదీ పరీవాహక ప్రాంతాల్లో ప్రజలు, రైతులను అప్రమత్తం చేయాలని రెవెన్యూ యంత్రాంగానికి సూచించారు.. నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల పరిధిలో నదీ పరీవాహక ప్రాంతం మాగనూరు వద్ద తంగడిగి నుంచి మొదలై అలంపూర్‌ గొందిమళ్ల వరకు ఉంటుంది. నదికి రెండు వైపులా రైతులు మోటార్లు వేసుకుని సాగునీటిని తరలించి పంటలు సాగు చేస్తుంటారు. ఈ క్రమంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఆలమట్టి జలాశయంలో మంగళవారం ఉదయానికి నీటి నిల్వ గరిష్ఠ స్థాయికి చేరటంతో నీటిని దిగువకు విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు మొదట 10 వేల క్యూసెక్కులను విడుదల చేసి సాయంత్రానికి నీటి విడుదల పెంచారు. దిగువన ఉన్న నారాయణ్‌పూర్‌ జలాశయంలోకి 40 వేల క్యూసెక్కులు వరకు వస్తుండటంతో దిగువకు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో 8 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. జూన్‌ మొదటి వారంలో నారాయణ్‌పూర్‌ గేట్ల మరమ్మతుల కోసం నీటిని విడుదల చేయటంతో మన జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ప్రస్తుతం వరద నీరు వచ్చిన వెంటనే జల విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు విడుదల చేయనున్నారు. నారాయణ్‌పూర్‌ నుంచి దిగువకు వదులుతున్న వరద నీరు 78 గంటల వ్యవధిలో జూరాలను తాకనుంది. కర్ణాటక ప్రాజెక్టుల నుంచి వరద నీటి విడుదల మొదలు కావటంతో జూరాల అధికారులు అప్రమత్తమయ్యారు. జూరాల వద్ద వరద నియంత్రణ వ్యవస్థ, పర్యవేక్షణ కోసం అదనపు సిబ్బందిని నియమించారు.పై నుంచి వరద నీటిరాక మొదలైన క్రమంలో జూరాల జలవిద్యుత్తు కేంద్రంలో ఒక యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభించారు. 2,400 క్యూసెక్కులు వరద వస్తుండగా విద్యుదుత్పత్తి కోసం 7,700 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 7.31 టీఎంసీలకు తగ్గించారు. వరద మరింత పెరిగితే మరో నాలుగు యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభిస్తామని జెన్‌కో అధికారులు తెలిపారు. ప్రస్తుతం జూరాల జలాశయంలో 7.31 టీఎంసీల నీరు నిల్వ ఉంది.4 టీఎంసీల మేర తోడిపోతఉమ్మడి జిల్లాలో మొదటి ప్రాజెక్టు అయిన జూరాలకు జూన్‌ తొమ్మిదో తేదీ నుంచి వరద మొదలైంది. వరద మొదలైన మరుసటి రోజు నుంచే ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి తోడిపోత మొదలైంది. మంగళవారం నాటికి నెట్టెంపాడు, కోయిలసాగర్‌, భీమా- 1, 2 లిఫ్ట్‌ల ద్వారా ఇప్పటి వరకు 4 టీఎంసీల మేర నీటిని తోడిపోశారు. నెట్టెంపాడులో రెండు పంపులు, మిగతా పథకాల్లో ఒక పంపు ద్వారా నీటి ఎత్తిపోత కొనసాగుతోంది. వరద పెరిగితే మరిన్ని పంపుల ద్వారా నీటిని ఎత్తిపోత పెంచనున్నారు.

 56 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.