AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జేసిఐ ఇందూరు ఆధ్వర్యంలో నిర్మల్ లో ఓరియేoటెషన్ తరగతులు నిర్వహించామని…

1 min read

AABNEWS :జేసిఐ ఇందూరు ఆధ్వర్యంలో నిర్మల్ లో ఓరియేoటెషన్ తరగతులు నిర్వహించామని జేసిఐ నిర్మల్ అధ్యక్షురాలు వి. వీణ మహేందర్ తెలిపారు.ఈ కార్యక్రమనికి నిజమాబాద్ జేసిఐ అధ్యక్షుడు పెందోటి చంద్రశేఖర్ అధ్యక్షత వహించారని, కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా నేషనల్ ట్రైనర్ శివరంజాన్ రెడ్డి, మొటివేషల్ స్పీకర్ తిరుణగరి శ్రీహరి, రమేష్, అరుణ్ లు వచ్చారని, ఈ కార్యక్రమంలో నేషనల్ ట్రైనర్ మాట్లాడుతూ..జేసీఐ అంటే ఏమిటి, జేసిఐ ఎలా ఉపయోగపడుతుందని అనే విషయాలతో పాటు, వ్యక్తి అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని, జేసిఐ ద్వారా వ్యక్తిత్వ వికాసం తో పాటు, బిజినెస్, కమ్మునికేషన్ స్కిల్స్ పెరుగుతాయని, సేవ కార్యక్రమాలు చేయడం ద్వారా సమాజంలో పెరు గుర్తింపు వస్తుందని, గుర్తింపుతో బాధ్యత పెరిగి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలనే సంకల్పం వృద్ధి చెందుతుందని అన్నారు…
తిరుణగరి శ్రీహరి మాట్లాడుతూ… నిర్మల్ లో జేసిఐ లామ్ ప్రారంభించటం అభినందనీయం అని, నిర్మల్ లో సేవ కార్యక్రమాలు చేయటానికి, తాను అభివృద్ధి చెంది, తనతో పాటు జిల్లాలో ఉన్న వారిని సైతం అభివృద్ధి పథంలో నడిపేందుకు యువతి అయి ఉండి, మహిళ శక్తిని ప్రపంచానికి పరిచయం చేయాలని ఉద్దేశ్యంతో నిర్మల్ లో జేసిఐ లామ్ ప్రారంభానికి ఫౌండర్ అధ్యక్షురాలు వీణ, ప్రధాన కార్యదర్శి గా మహేందర్ జేసిఐ టీమ్ ముందుకు రావటం శుభ పరిణామం అన్నారు..
అధ్యక్షుడు చంద్రశేఖర్ పెందోటి మాట్లాడుతూ… జేసిఐలో చేరి, తాను ఎదుగుతూ..చుట్టూ ఉన్న వారిని ఎదుగుదలకు తోడ్పడాలనే ఆశయంతో ట్రెనింగ్ పూర్తి చేసి, నిర్మల్ జిల్లా వాసులకు ఈ సువర్ణ అవకాశాన్ని అందించడం గొప్ప విషయం అన్నారు…కార్యక్రమంలో ప్రణయ్, మధు, భూమన్న యాదవ్, రాజేందర్, పోల కృష్ణ, శశికాంత్, జాప అనిల్,సతీష్, శ్రీధర్, నాయుడి రమేష్, నిగులప్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు…

 1,408 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.